biravadeepam Re Release : బాలయ్య సినిమా వాయిదా..కారణం అదేనట

సుమారు 29 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు

Published By: HashtagU Telugu Desk
biravadeepam Re Release Postponed

biravadeepam Re Release Postponed

నందమూరి బాలకృష్ణ (Balakrishna)..ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తన వయసును సైతం పక్కన పెట్టి యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో భగవంత్ కేసరి (Bhagwant kesari) మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో కాజల్ (Kajal) హీరోయిన్ గా నటిస్తుండగా..ధమాకా ఫేమ్ శ్రీ లీల (Sreeleela) బాలకృష్ణ కు చెల్లెలి పాత్ర చేస్తుంది. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్‌ బంప్స్‌ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించిన ఎస్‌ థమన్‌ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : AP : టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – చంద్రబాబు కీలక ప్రకటన

ఇదిలా ఉంటె బాలకృష్ణ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం చిత్రసీమలో రీ రిలీజ్ (Re Release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ పేరుతో సరికొత్త టెక్నాలజి తో విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ , చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , ఎన్టీఆర్ . మహేష్ బాబు మొదలగు హీరోల చిత్రాలు రీ రిలీజ్ కాగా..బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం (Biravadeepam ) చిత్రాన్ని ఈరోజు (ఆగస్టు 30) రీ రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం తో సినిమాను వాయిదా వేశారు. సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రోజా, బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించింది. సుమారు 29 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ప్లాన్ చేసారు. మరి కొత్త రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

  Last Updated: 30 Aug 2023, 03:56 PM IST