బయోపిక్‌లు నాకు చాలా స్ఫూర్తినిస్తాయి : హీరో సూర్య

హీరో తమిళ్ సూర్య అనగానే వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతాయి. మిగతా హీరోలు కమర్షియల్ సినిమాలు అంటూ పరుగులు తీస్తుంటే.. సూర్య మాత్రం కథా బలమున్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

  • Written By:
  • Updated On - October 26, 2021 / 04:52 PM IST

హీరో తమిళ్ సూర్య అనగానే వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతాయి. మిగతా హీరోలు కమర్షియల్ సినిమాలు అంటూ పరుగులు తీస్తుంటే.. సూర్య మాత్రం కథా బలమున్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆయన నుంచి రక్తచరిత్ర, 7సెన్స్, ఆకాశం నీ హద్దురా, గజినీ లాంటి చిత్రాలు ప్రేక్షుకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఆయన ‘జైభీమ్’ లో నటించారు. ఈ సినిమాను సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా సూర్యతో కొన్ని ముచ్చుట్లు..

నాది లాయర్ పాత్ర. అన్యాయానికి గురైన ఓ గిరిజన కుటుంబం కోసం పోరాటం చేసే లాయర్ గా కనిపిస్తాను. కోర్టులో న్యాయం దక్కకపోతే రోడ్డుపైకి వెళ్లి పోరాడేందుకు సిద్ధపడే క్యారెక్టర్. అన్యాయానికి గురైన గిరిజన కుటుంబానికి న్యాయం జరుగుతుందో తెలియాంటే ‘జై భీమ్‌’ చూడాల్సిందే.

జైభీమ్ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం రీమేక్‌కు సంబంధించిన పనులు ముమ్మురంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలో తెలియజేస్తాను. ఇంతకు ముందు చెప్పని వాస్తవమైన కథను కొత్తగా చెప్పాలనేది నా ఉద్దేశ్యం. కథ బాగా నచ్చి నిజాయతీగా సినిమా తీశాను. సినిమా ఎక్కువ భాగం కోర్ట్ రూం డ్రామా చుట్టూ తిరుగుతుంది.  హైకోర్టు వాతావరణాన్ని చూపించేలా, సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా ఈ సినిమాను తీశాం.

సమాజంలో లాయర్లు ఏమి చేస్తుంటారు. వాళ్ల పాత్ర ఏమిటి? అనే విషయాలు ఈ మూవీలో ఉంటాయి. బయోపిక్‌లు నాకు చాలా స్ఫూర్తినిస్తాయి. అందుకే ఈ తరహా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నా.

జైభీమ్ విషయంలో కొంతమంది నొచ్చుకున్నారు. ఫ్యాన్స్ నాకు అండగా నిలిచారు. అభిమానుల ప్రేమే నన్ను వైవిధ్యమైన సినిమాలు తీసేలా ఎంకరేజ్ చేస్తుంది. అందుకే వాళ్లు ఆశించిన సినిమాలు తీస్తుంటా. నేను దర్శకుడ్ని, రచయితను కాదు. నాకు కావలసింది మంచి స్క్రిప్ట్ మాత్రమే, స్క్రిప్ట్ ఏదైనా భిన్నంగా ఉండాలి, మనల్ని ఉత్తేజపరిచేలా ఉండాలి. నాకు, జ్యోతికకు సరిపడే కథ దొరికితే.. కచ్చితంగా కలిసి నటిస్తాం.