Prabhas Billa: ట్రస్ట్ నో వన్.. కిల్ ఎనీ వన్.. బిల్లా మళ్లీ వచ్చేస్తున్నాడు!

కేవలం బాహుబలి సినిమాతోనే ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా అవతరించలేదు. అంతకుముందు సినిమాలతో తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 05:14 PM IST

కేవలం బాహుబలి సినిమాతోనే ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా అవతరించలేదు. అంతకుముందు సినిమాలతో తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. భారీ బడ్జెట్‌, అద్భుతమైన స్టార్ కాస్ట్‌తో బిల్లా సినిమాతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ప్రభాస్‌ని కెరీర్ ప్రారంభం నుండి చూసిన జనాలు ప్రభాస్ ఎనర్జీ, స్టైల్, హ్యాండ్సమ్‌నెస్‌ని బాగా మిస్ అవుతున్నారు.

తన అభిమానుల దాహార్తిని తీర్చేందుకు అక్టోబర్ 23న ‘బిల్లా’ స్పెషల్ స్క్రీనింగ్స్ జరగనున్నాయి. రీ-రిలీజ్‌కు ముందు, చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. యాక్షన్ ఎపిసోడ్‌లతో నిండిన ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. దివంగత కృష్ణంరాజుకు నివాళులర్పిస్తూ, ట్రైలర్‌ ప్రారంభమై ముగుస్తుంది.

ప్రభాస్ యంగ్ వెర్షన్‌ని మరోసారి చూడటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. మృదువుగా ఉండే డిజైనర్ సూట్‌లలో, ప్రభాస్ అండర్ వరల్డ్ డాన్స్ ను ఆట ఆడిస్తాడు. అనుష్క గ్లామరస్ లుక్ లో కనిపించి వావ్ అనిపించింది. మణిశర్మ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి మాయ చేస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న బిల్లా సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.