Site icon HashtagU Telugu

Shobha Shetty Yaswanth Reddy Engagement : హౌస్ లో అనౌన్స్ మెంట్.. ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్..!

Biggboss Shobha Shetty Yaswanth Reddy Engagement

Biggboss Shobha Shetty Yaswanth Reddy Engagement

Shobha Shetty Yaswanth Reddy Engagement బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టి హంగామా తెలిసిందే. స్టార్ మా బ్యాచ్ లో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక వీళ్ల ముగ్గురు హౌస్ లో తమ ముద్ర వేశారు. శోభా శెట్టి జస్ట్ ఒక వారం ముందు హౌస్ నుంచి బయటకు వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join

కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభా శెట్టి ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి వచ్చింది. అక్కడ తన ఆటతో అందరినీ మెప్పించింది. టాప్ 5లో లేదన్న మాటే కానీ ఫైనల్ ముందు వారం వరకు శోభా శెట్టి హంగామా చేసింది.

హౌస్ లో టేస్టీ తేజాతో క్లోజ్ గా ఉన్న శోభా శెట్టి అతను ప్రేమిస్తున్నానని వెంటపడినా సరే లైట్ తీసుకుంది. అయితే అదే హౌస్ లో ఉన్నప్పుడు తనకు యశ్వంత్ రెడ్డితో ఉన్న ప్రేమని బయట పెట్టింది. ఇద్దరు కలిసి కార్తీక దీపం సీరియల్ లో నటించారు. ఆ టైం లోనే శోభా శెట్టికి దగ్గరయ్యాడు యశ్వంత్ రెడ్డి. బిగ్ బాస్ హౌస్ లో వీరి ప్రేమని వెల్లడించారు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన శోభా శెట్టి ఎక్కువ రోజులు గ్యాప్ లేకుండానే యశ్వంత్ రెడ్డితో ఎంగెజ్మెంట్ చేసుకుంది. శోభా శెట్టి బెంగుళూరు ఇంట్లోనే యశ్వంత్ రెడ్డితో ఎంగేజ్ మెంట్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సీరియల్ బ్యాచ్ ఎవరు కూడా శోభా శెట్టి ఎంగేజ్మెంట్ లో పాల్గొన్నట్టు లేరు.

Also Read : Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు రిలీజ్