Site icon HashtagU Telugu

BiggBoss Season 8 : బిగ్ బాస్ 8 స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే.. ప్రోమో వచ్చేసింది..?

Bigg Boss 8 Telugu vs Kannada

Bigg Boss 8 Telugu vs Kannada

బుల్లితెర ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 (BiggBoss Season 8) ప్రోమో వచ్చింది. ఈసారి సీజన్ 8 లోగో కాస్త కొత్తగా ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 ఇదేదో అష్టదిగ్బంధనం కాన్సెప్ట్ లా కొడుతుంది. బిగ్ బాస్ అని వేసి దానిమద్యలో 8 ఉంచి అందులో ఏదో డిజైన్ వేశారు. చూస్తుంటే సీజన్ 7 ఉల్టా పుల్టా లానే ఈసారి కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో వచ్చింది కాబట్టి షో కూడా మొదలయ్యే డేట్ కూడా రివీలైంది.

సెప్టెంబర్ 8 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 వస్తుందని తెలుస్తుంది. ఈ సీజన్ ను కూడా కింగ్ నాగార్జున (King Nagarjuna) హోస్ట్ గా చేయబోతున్నారు. హోస్ట్ గా నాగార్జున తప్ప మిగతా హీరోలు ఎవరు అంతగా ఆసక్తి చూపించట్లేదు. అందుకే బిగ్ బాస్ హోస్ట్ అంటే నాగార్జుననే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8 లో చాలా మంది సోషల్ మీడియా సెలబ్రిటీస్ పాల్గొంటారని తెలుస్తుంది.

సీజన్ 8 లో ముఖ్యంగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy)తో పాటుగా బర్రెలక్క, కుమారి ఆంటీ (Kumari Aunty)ల పేర్లు వినిపిస్తున్నాయి. బంచిక్ బబ్లూ, వర్షిణి లు కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా వస్తారని టాక్. ప్రస్తుతం బిగ్ బాస్ సెట్ ని సిద్ధం చేస్తుండగా సెప్టెంబర్ 8న గ్రాండ్ ఈవెంట్ గా షోని మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా అమర్ దీప్ కానీ శివాజి కూడా చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో రన్నర్ గా అమర్ దీప్ (Amardeep) రాగా.. శివాజి టాప్ 3 లో ఉన్నాడు. ఇద్దరు కూడా షోతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐతే లాస్ట్ సీజన్ లో కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.