Site icon HashtagU Telugu

Priyanka Singh : బాత్ టబ్ లో బిగ్ బాస్ బ్యూటీ.. ఇది నా జాబ్ లో భాగం.. తప్పుగా అనుకోవద్దంటుంది..!

Biggboss Priyanka Singh Fantasy Video Song

Biggboss Priyanka Singh Fantasy Video Song

Priyanka Singh జబర్దస్త్ లో సాయి తేజగా నటించిన కుర్రాడు కాస్త ప్రియాంక సింగ్ అంటూ ఒక అందమైన అమ్మాయిలా మారుతారని ఎవరు అనుకోలేదు. జబర్దస్త్ తో సూపర్ పాపులర్ అయిన ప్రియాంక సింగ్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా మెప్పించింది. ఆ సీజన్ లో మానస్ పై ఇష్టం పెంచుకున్న ప్రియాంక హౌస్ లో ఉన్న అందరినీ అన్నయ్య అని పిలిచింది కానీ మానస్ ని మాత్రం పిలవలేదు.

బిగ్ బాస్ అనంతరం ప్రియాంక సింగ్ పెద్దగా హడావిడి చేసింది లేదు కానీ అడపాదడపా షోలలో కనిపిస్తూ వస్తుంది. ఇక లేటెస్ట్ గా ప్రియాంక సింగ్ బాత్ టబ్ లో వైన్ గ్లాస్ చేతిలో పట్టుకుని ఉన్న వీడియో బయటకు వచ్చింది. బాత్ రూం లో ఇలా వీడియోలు తీసుకునే పద్ధతి ఏంటి. అసైనా ప్రియాంక బాత్ టబ్ లో వైన్ వీడియో ఎలా బయటకు వచ్చింది అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.

Fantasy

అంతేకాదు ఆ వీడియోపై ప్రియాంక సింగ్ ని నెటిజెన్లు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ తో ఆడుకున్నారు. ఈ క్రమంలో ప్రియాంక సింగ్ ఈ కామెంట్స్ పై రెస్పాండ్ అయ్యింది. తను ఇలా చేయడం తన జాబ్ లో భాగమని అన్నది. మీరు తప్పుగా అర్ధం చేసుకోవద్దని అంటుంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే ప్రియాంక సింగ్ ఫాంటసీ అనే ప్రైవేట్ వీడియో సాంగ్ లో నటించింది. ఆ సాంగ్ కు సంబందించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది సాంగ్ లో భాగమని తెలియకుండా ప్రియాంక సింగ్ సీక్రెట్ వీడియో అన్నట్టుగా వైరల్ చేశారు. కట్ చేస్తే ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.