Site icon HashtagU Telugu

Syed Sohel : థియేటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. కానీ కొందరు యూట్యూబ్‌లో సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..

BiggBoss fame Syed Sohel comments on his Movie Mr Pregnant in Success Meet

BiggBoss fame Syed Sohel comments on his Movie Mr Pregnant in Success Meet

బిగ్‌బాస్(Bigg Boss) ఫేమ్ సోహెల్(Sohel) వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోహెల్, రూపా కొడవాయుర్(Roopa Koduvaayur) జంటగా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో మిస్టర్ ప్రగ్నెంట్(Mr Pregnant) సినిమాతో వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్లోకి వచ్చింది. భార్య ప్రగ్నెన్సీని భర్త తీసుకొని ప్రగ్నెంట్ గా మారితే ఎలాంటి సమస్యలు, కష్టాలు వచ్చాయి, వాటిని ఎదుర్కొని బిడ్డను ఎలా కన్నారు అనేదానిపై మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా తెరకెక్కింది.

ఇక మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో ప్రేక్షకులని, ముఖ్యంగా మహిళలని కట్టిపడేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

మిస్టర్ ప్రగ్నెంట్ క్సెస్ మీట్ లో హీరో సోహైల్ మాట్లాడుతూ.. నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని అన్నారు. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది. కొన్ని థియేటర్లకు వెళ్లి సినిమా చూశాను. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారు. థియేటర్స్ వద్ద పబ్లిక్ టాక్ వినండి ఏ ఒక్కరూ నెగిటివ్ గా చెప్పలేదు. మేము, మా సినిమా సక్సెస్ అయ్యాం. కానీ యూట్యూబ్ లో కొంతమంది స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి అని మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

 

Also Read : Brahmanandam Son Marriage : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. బ్రహ్మానందం కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?