Site icon HashtagU Telugu

Arohi : శాకుంతలం బాగోలేదు అన్న వాళ్లంతా చైతూ ఫ్యాన్స్.. సంచలన వ్యాఖ్యలు..

BiggBoss Arohi sensational comments on Shakunthalam movie result

BiggBoss Arohi sensational comments on Shakunthalam movie result

సమంత(Samantha) ఇటీవల శాకుంతలం(Shakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజయింది. ప్రమోషన్స్ భారీగా చేసి సినిమాపై హైప్ ని పెంచారు. కానీ తీరా థియేటర్ కి వెళ్లి చూశాకా సినిమా ఏమి లేక ప్రేక్షకులను ఆకట్టుకోలేక పరాజయం పాలైంది. అల్లు అర్జున్(Allu Arjun) కూతురు అర్హ(Arha) ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటంతో అర్హ కోసం బన్నిఅభిమానులు కూడా ఈ సినిమాని చూడటానికి వస్తున్నారు. అర్హ మాత్రం చాలా బాగా నటించిందని అంటున్నారు.

స్టోరీని బాగా సాగదీయడం, VFX సరిగ్గా లేకపోవడం, మ్యూజిక్ కూడా అంతగా సెట్ కాకపోవడం, కొని చోట్ల సమంత నటన కూడా ఓవర్ గా ఉండటం.. ఇలా పలు రీజన్స్ తో శాకుంతలం పరాజయం పాలైంది. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుంది అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ ఆరోహి శాకుంతలం పరాజయంపై సంచలన వ్యాహ్యాలు చేసింది.

తాజాగా శాకుంతలం సినిమా చుసిన ఆరోహి తన రివ్యూ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో.. సినిమా కొంచెం సాగదీశారు, నేను ఒప్పుకుంటాను. పురాణాలు తెలియని వాడికి ఈ సినిమా పంచతంత్రం కథలాగే అనిపిస్తుంది. సమంత నటన బాలేదు అన్నవాళ్లంతా చైతన్య ఫ్యాన్స్ కన్ఫర్మ్. కథ ఉన్నది ఉన్నట్టు తీశారు, మషాలా యాడ్ చేసి , ఫిక్షన్ చేసి తీస్తే చూసేవాళ్ళేమో. అర్హ చాలా బాగుంది కానీ, అర్హ కన్నా అద్భుతంగా చేస్తూ అవకాశాల కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓవరాల్ గా యావరేజ్ మూవీ. ఫ్లాప్ అయితే కాదు నా వరకు అని ఆరోహి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

దీంతో ఈ పోస్ట్ వైరల్ కాగా చైతన్య ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ ఆరోహిని విమర్శిస్తున్నారు. మరోసారి ఆరోహి పోస్ట్ తో చైతన్య, సమంత ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవ జరుగుతుంది. అర్హని మార్కెట్ కోసం, స్పెషల్ అట్రాక్షన్ కోసం, హైప్ పెంచడం కోసం తీసుకున్నారు, అసలు అర్హ లేకపోతే ఈ జనాలు కూడా వచ్చేవాళ్ళు కాదు అని బన్నీ అభిమానులు ఆరోహిపై కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read :   Mahesh Babu Rapid Fire: మహేశ్ తో ర్యాపిడ్ ఫైర్.. సూపర్ స్టార్ పర్సనల్ విషయాలు ఇవే!