Site icon HashtagU Telugu

Bigg Boss Season 6: మీ ఇంట్లో మ్యానర్స్ నేర్పలేదా అంటూ ఇనయాపై చెయ్ ఎత్తిన రేవంత్?

Bigg Boss

Bigg Boss

Bigg Boss Season 6: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 మూడవ వారం రసవత్తరంగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే మూడో వారానికి చేరుకుంది. ఇది ఇలా ఉంటే ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే ఒక టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ అడవిలో ఆట అనే టాస్క్ లో భాగంగా హౌస్ లోని కొంతమంది కంటెస్టెంట్ లను పోలీసులుగా మరి కొంత మందిని దొంగలుగా విభజించాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా గీతూ వ్యహరిస్తుంది.

అయితే ఈ టాస్కులో కూడా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్ లో దొంగలు పోలీసులకు మధ్య జరిగిన గొడవలో ఆరోహి రావ్ కిందపడి గాయాలపాలయ్యింది. అయితే ఆరోహి కిందపడి గాయాలు అవ్వడానికి కారణం శ్రీహాన్ అని నిందిస్తుంది ఇనయా. వాడే కాళ్లు పట్టి లాగాడు అంటూ పక్కన ఉన్న కంటెంట్ చెబుతుంది. ఇంతలోనే శ్రీహాన్ అక్కడికి వచ్చి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వాడు.. వీడు ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఇనయా పై ఫైర్ అవుతాడు.

ఇంతలోనే రేవంత్‌ కు కూడా ఇనయాతో ఇదే విషయంలో వాదనకు దిగుతాడు. వాడు ఏంటి వాడు? మీ ఇంట్లో మ్యానర్స్‌ నేర్పలేదా అంటూ రేవంత్‌ ఇనయా పై విరుచుకుపడతాడు. మొత్తానికి ఈ ప్రోమో ని బట్టి చూస్తే అడవిలో ఆట అనే టాస్క్ కూడా కొట్లాటలో, గొడవలు, ఏడుపులు గాయాలతో కసవతరంగా సాగింది అని అనిపిస్తోంది. ఇక ఇనయా,రేవంత్,శ్రీ హాన్ లలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే మరి.