Bigg Boss7 Shivaji : మెగా ఫ్యామిలీ గురించి శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

శివాజీ (Shivaji )..బిగ్ బాస్ (Bigg Boss7) ముందుకు ఎంతమందికి తెలుసో కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం చాలామంది ఆయనకు అభిమానులయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7 లో తనదైన ఆట తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ విన్నర్ శివాజే అవుతాడని అంత భావించారు కానీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)విజేతయ్యాడు. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కొన్ని రోజులు పాటు ఇంటికే పరిమితమైన శివాజీ..ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తూ మళ్లీ […]

Published By: HashtagU Telugu Desk
Shivaji Mega Family

Shivaji Mega Family

శివాజీ (Shivaji )..బిగ్ బాస్ (Bigg Boss7) ముందుకు ఎంతమందికి తెలుసో కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం చాలామంది ఆయనకు అభిమానులయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7 లో తనదైన ఆట తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ విన్నర్ శివాజే అవుతాడని అంత భావించారు కానీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)విజేతయ్యాడు. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కొన్ని రోజులు పాటు ఇంటికే పరిమితమైన శివాజీ..ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తూ మళ్లీ బిజీ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బిగ్ బాస్ వెళ్లకముందు #90’S అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో జనవరి 5 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా..తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ” మెగాస్టార్ ఫ్యామిలీకి ఏపీలో కానీ, తెలంగాణలో కానీ వాళ్లకున్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు. అసలు వాళ్లకు సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు. నేను ఏది చెప్పినా క్లియర్ గా చెప్పేస్తా.. అది కొంతమందికి నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు.. ఎక్కడ లోపం జరుగుతుందో అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు.. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వడం ఖాయం” అని చెప్పుకొచ్చాడు. శివాజీ.. ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సీఎం కావడం పెద్ద కష్టమేం కాదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read Also : Chandrababu : జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది – చంద్రబాబు

  Last Updated: 30 Dec 2023, 08:50 PM IST