Site icon HashtagU Telugu

Bigg Boss7 : మహేష్ రానన్నాడా.. బిగ్ బాస్ షోపై సెలబ్రిటీల అనాసక్తి ఎందుకు..?

Bigg Boss7 Celebrities Not Interested In Bigg Boss Show

Bigg Boss7 Celebrities Not Interested In Bigg Boss Show

బిగ్ బాస్ (Bigg Boss7) మీద సెలబ్రిటీస్ అనాసక్తి చూపిస్తున్నరా అంటే అవుననే చెప్పొచ్చు. 105 రోజులు బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. బుల్లితెర ఆడియన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఈ సీజన్ ఎంతగానో అలరించింది. అయితే ఈ షో ముగింపు మాత్రం ఆడియన్స్ ని నిరుత్సాహ పరచింది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ ని చప్పగానే ముగించారు బిగ్ బాస్ టీం. అసలైతే ఫైనల్ ఎపిసోడ్ కి ఏ స్టార్ హీరోనో తీసుకొచ్చి టైటిల్ విజేతని అనౌన్స్ చేయిస్తారు.

సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ వస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే మహేష్ ని సంప్రదించినా సూపర్ స్టార్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదని టాక్. అంతేకాదు మహేష్ ఆల్రెడీ గుంటూరు కారం షూట్ లో ఉన్నాడు. అందుకే బిగ్ బాస్ షోకి రావడం కుదరదని చెప్పాడట.

Also Read : Prabhas Salaar : సలార్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత..? రికార్డుల వేట మొదలైంది..!

మహేష్ కాకపోయినా మరో సెలబ్రిటీని తీసుకు రావొచ్చు కానీ ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదని టాక్. అయితే బిగ్ బాస్ నడుస్తున్న టైం లో సినిమా ప్రమోషన్స్ కి సెలబ్రిటీస్ వస్తారు కానీ విన్నర్ ని డిసైడ్ చేసే ఎపిసోడ్ కి మాత్రం ఎవరు రాలేదు. ఫైనల్ ఎపిసోడ్ లో రవితేజ వచ్చి తన సినిమా ప్రమోట్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేసి వెళ్లాడు.

బిగ్ బాస్ షో అంతా బాగా నడిపించిన టీం చివరి ఎపిసోడ్ అది కూడా టైటిల్ విజేతని ప్రకటించే ఎపిసోడ్ ని సరిగా ప్లాన్ చేయలేదు. ఎవరైనా సెలబ్రిటీని తీసుకొచ్చి ఉంటే ఇంకాస్త బాగుండేదని బిగ్ బాస్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join