Site icon HashtagU Telugu

Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7.. 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఎవరెవరు ఉన్నారంటే..

Bigg Boss Telugu Season 7 full contestants list

Bigg Boss Telugu Season 7 full contestants list

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss) తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తాజాగా నిన్న ఆదివారం నుంచి ఏడవ సీజన్(Bigg Boss 7) మొదలైంది. నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా ఎంతో గ్రాండ్ గా, స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైంది. ముందు నుంచి ఈ షోలో ఎవరెవరు వస్తారని అంతా ఎదురు చూడగా 14 మందిని తీసుకొచ్చారు.

ఈ సారి బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్(Bigg Boss Contestants) వీళ్ళే..

సీరియల్ నటి ప్రియాంక జైన్. పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.

సినిమా నటుడు శివాజీ. బిగ్‌బాస్ తో చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు.

ప్రముఖ సింగర్ దామిని భట్ల.

మోడల్, సీరియల్ నటుడు ప్రిన్స్ యావర్.

నటి శుభశ్రీ రాయగురు. సినిమాల్లో, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.

షకీలా. ఒకప్పటి టాప్ బి గ్రేడ్ హీరోయిన్, బోల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా రోజుల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్.

కార్తీకదీపం సీరియల్ ఫేమ్, సీరియల్ ఆర్టిస్ట్ శోభా శెట్టి.

నటుడు, యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ.

నటి రతిక రోజ్. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.

నటుడు, డాక్టర్ గౌతమ్ కృష్ణ.

సీనియర్ నటి, బోల్డ్ ఆర్టిస్ట్ కిరణ్ రాథోడ్. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్.

సీరియల్ నటుడు అమర్ దీప్. సీరియల్స్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

వీరే కాకుండా షో మధ్యలో మరో ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కూడా వస్తారని సమాచారం. మరి వీరిలో ఈ సారి బిగ్‌బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు , శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటల నుండి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవుతుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 24/7 లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది.