Site icon HashtagU Telugu

Bigg Boss Beauty: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తెలుగు బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న మంగళ స్నానం వీడియో?

Bigg Boss Beauty

Bigg Boss Beauty

బిగ్ బాస్ సీజన్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే బిగ్ బాస్ బ్యూటీ కూడా ఒకరు. బిగ్బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 12 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్బాస్ సీజన్ 8 లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.

దాదాపుగా వారానికి రెండున్నర లక్షల వరకు పారితోషకం అందుకుంది. ఇప్పటికే ఈపాటికి ఆమె ఎవరు అన్నది అర్థమై ఉంటుంది. కానీ మరెవరో కాదండోయ్ బిగ్ బాస్ యష్మీ. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్మీ అదే ఊపుతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, సీరియల్స్ తో బిజి బిజీగా గడుపుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

 

ఇదిలా ఉంటే యష్మీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యష్మీ పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని, మంగళ స్నానం చేస్తూ కనిపించి షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదేంటి యష్మీక సడన్గా పెళ్లి చేసుకుంటుందా? అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఈ విషయం గురించి ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది రియల్ పెళ్లి కాదని రీల్ పెళ్లి అని తెలుస్తోంది. ఏదో సీరియల్‌ లోని సీన్ కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.