Bigg Boss Telugu 7: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించే బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే తారలు ఎవరన్న దానిపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ సారి షోని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న నిర్వాహకులు కంటెస్టెంట్స్ పై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది పేర్లతో ప్రచారం జరుగుతుంది. వీళ్ళే ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లో ఉండేదంటూ ప్రచారం చేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే మొదటి జంట అమరదీప్, తేజస్విని అని తెలుస్తుంది. వీరిద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. బుల్లితెర పరిశ్రమలో నటులుగా, యాంకర్స్ గా కొనసాగుతున్నారు. బుల్లితెర నటి శోభాశెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతనాయుడు, క్రికెటర్ వేణుగోపాల్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Read More: Jagan BC Card : YCP సంస్థాగత ప్రక్షాళన! TTD చైర్మన్ గా `జంగా`?