Site icon HashtagU Telugu

Bigg Boss telugu 6: ఇనయా, సుదీప.. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

Bigg Boss Latest Promo

Bigg Boss Latest Promo

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూశారు. అంతేకాకుండా బిగ్బాస్ సీజన్ 6 కీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది అని అందరూ ఆశించారు. కానీ ఈసారి ఊహించిన విధంగా రేటింగ్ రావడం లేదు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి వారంలో నాగార్జున కంటెస్టెంట్లపై ఫైర్ అవడంతో అప్పటినుంచి అందరూ సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నవారికి ఎవరికి అత్యధికంగా ఓట్లు పడ్డాయి అన్న విషయానికి వస్తే.. ఎప్పటిలాగే రేవంత్ మల్లి టాప్ లో కొనసాగుతున్నాడు. అయితే గత వారంలో ఓట్లు కాస్త తక్కువే వచ్చినప్పటికీ ఈసారి అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకుని మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక రెండవ స్థానంలో శ్రీహాన్ ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో గీతూ కొనసాగుతోంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న ఆదిత్య వివాదాలకు వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.

కాగా ప్రస్తుతం జబర్దస్త్ చంటి కూడా ట్రాక్ లోకి వస్తుండడంతో అతనికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. దీంతో ఐదవ స్థానంలో వాసంతి కొనసాగుతూ ఉండగా ఆరవ స్థానంలోకి చంటి చేరుకున్నాడు. కానీ ఆరోహికి మాత్రం ఓట్లు పడటం లేదు. ఆమె ప్రస్తుతం ఏడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక నేహా ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. ఇక చివరి రెండు స్థానాలలో ఇనయా, సుదీప కొనసాగుతున్నారు. వీరిద్దరిలో సుదీపకు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. కథ ఈ ఇద్దరిలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోవచ్చు.