Site icon HashtagU Telugu

Bigg Boss 6: మళ్లీ మొదలైన ఇనయ శ్రీ హాన్ లొల్లి.. ఈవారం వరస్ట్ కంటెంట్ ఎవరంటే?

Bigg Boss 6

Bigg Boss 6

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో గొడవలు కోపాలు అలకలు, ఏడుపులతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కాగా తాజాగా కెప్టెన్ కోసం ఫైనల్ గా కీర్తి, శ్రీహాన్ సూర్యలు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇందులో తక్కువ కత్తి ఓట్లు పడిన శ్రీహాన్ ఇంటి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. రాజన్న బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. తాజాగా బిగ్ బాస్ సాంగ్స్ లో యమహా కాల్ ఆఫ్ ది బ్లూ అని టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ పోటీలో శ్రీ సత్య,కీర్తి రోహిత్, రేవంత్ లు పాల్గొనగా చివరికి రోహిత్ గెలిచినట్లు ఇనయ ప్రకటించింది.

రోహిత్ ని గెలిచినట్లు ఇనయ ప్రకటించడంతో రేవంత్ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఇనయ ఎంత పిలిచినా కూడా పలకకుండా నా మైండ్ బాలేదు అని సీరియస్ గా చెప్పి వెళ్లి కూర్చున్నాడు. అనంతరం బిగ్ బాస్ ఈవారం వరస్ట్ కంటెంట్ ఎవరు చెప్పాల్సిందిగా ఆదేశించాడు. అప్పుడు శ్రీహను బాలాదిత్యకు ఎరుపురంగు పూసి వరస్ట్ కంటెంట్ గా ఎంచుకున్నాడు. అప్పుడు హౌస్ లో రైస్ గురించి మాట్లాడగా అప్పుడు వెంటనే శ్రీహన్ హౌస్ లో రైస్ ఎక్కువ వదిలేస్తున్నారు అని అనడంతో వెంటనే ఇనయ స్పందిస్తూ నేను ఎక్కువ అయ్యిందని వదిలేయలేదు కర్రీ లేక వదిలేసాను అని అంటుంది.

 

అప్పుడు శ్రీహాన్ అందరికీ లేని ప్రాబ్లం నీకెందుకు అని అంతే నేను చేసింది తప్పు కాదని అందరికీ క్లారిటీ ఇస్తున్నాను అని వినయం అంటుంది.. అప్పుడు శ్రీకాంత్ నేను మాట్లాడుతున్నప్పుడు కాదు. తర్వాత ఇచ్చుకో ఇది నా టైం.. అందరికీ పాయింట్ చెబుతున్నప్పుడు కామ్ గా ఉండు. మధ్యలో మాట్లాడకు అంటూ శ్రీ హాన్ సీరియస్ అవుతాడు. అప్పుడు ఇనయ కర్రీ వేయలేదు అందుకే తినలేదు అని అంటే రైస్ కు నువ్వు ఇచ్చే వ్యాల్యూ ఇదేనా అని అంటాడు శ్రీహాన్. మొత్తానికి హౌస్ లో రైస్ విషయంలో శ్రీహాన్, ఇనయ ల మధ్య గొడవ మళ్ళీ మొదలైంది.