Site icon HashtagU Telugu

Siri Hanmanth : జబర్దస్త్ లో కొత్త యాంకర్.. బిగ్ బాస్ తర్వాత అమ్మడికి లక్కీ ఛాన్స్..!

Bigg Boss Siri Hanmanth Is New Jabardast Anchor

Bigg Boss Siri Hanmanth Is New Jabardast Anchor

Siri Hanmanth బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఎంత పాపులర్ అన్నది అందరికీ తెలిసిందే. ఆ షోలో పాల్గొన్న వారంతా కూడా స్టార్డం తెచ్చుకున్నారు. స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్ ఎన్నో అవకాశాలకు వేదికగా మారింది జబర్దస్త్. జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇప్పుడు తెలుగులో వెరైటీ పాత్రలు చేస్తూ మంచి కెరీర్ కొనసాగిస్తుంది. ఇక జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ అంతా కూడా సినిమాలు షోస్ చేస్తూ రాణిస్తున్నారు. జబర్దస్త్ ని అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ ని రష్మి కొన్నేళ్లుగా యాంకరింగ్ చేస్తూ వచ్చారు.

అయితే అనసూయ తర్వాత జబర్దస్త్ (Jabardasth) కి సీరియల్ యాక్ట్రెస్ సౌమ్యాని దించారు. ఆమె యాంకరింగ్ బాగానే అనిపించగా ఇప్పుడు కొత్తగా ఆమె ప్లేస్ లో మరో కొత్త యాంకర్ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు అమ్మాయి యూట్యూబ్ లో షార్ట్ ఫిలంస్ చేసి అలరించిన సిరి హన్మంత్ బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 5 లో కూడా స్టార్ కంటెస్టెంట్ గా క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ మా సీరియల్స్ చేస్తూ వచ్చిన సిరి లేటెస్ట్ గా జబర్దస్త్ యాంకరింగ్ పోస్ట్ కొట్టేసింది.

Also Read : Bigg Boss 7 : టేస్టీ తేజ ఎలిమినేషన్.. ఆ ఒక్కటి జరిగి ఉంటే..!

కేవలం కొద్దిరోజుల పాటే సిరి యాంకరింగ్ చేస్తుందా లేదా పర్మినెంట్ గా ఆమెను ఉంచుతారా అన్నది చూడాలి. సిరి హన్మంత్ కి జబర్దస్త్ లాంటి షో యాంకరింగ్ ఛాన్స్ రావడం నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. 10 ఏళ్లుగా ఏ కామెడీ షో తీసుకురాలేని రేటింగ్ తెస్తూ దూసుకెళ్తున్న జబర్దస్త్ లో సిరి యాంకరింగ్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది.

బిగ్ బాస్ తర్వాత కేవలం తన ఫోటో షూట్స్ తోనే అలరించిన సిరి సినిమాల్లో కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేదు. కానీ ఇప్పుడు జబర్దస్త్ యాంకరింగ్ ఛాన్స్ ఆమె కెరీర్ ని ట్రాక్ ఎక్కిస్తుందని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join