బిగ్ బాస్ (BiggBoss,) సీజన్ 8 మరో రెండు వారాలు మాత్రమే ఉంది. సీజన్ 8 లో ముందు 14 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ మొదలు పెట్టగా ఐదు వారాల తర్వాత మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డులను పంపించారు. వైల్డ్ కార్డ్, పాత కంటెస్టెంట్స్ ఇలా అందరు కలిసి ఆట ఆడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంటున్న ఈ టైం లో టాప్ 5 కి ఎవరు వెళ్తారు.. ఈ సీజన్ విన్నర్ ఎవరు వెళ్తారన్నది ఆడియన్స్ ఆసక్తికరంగా ఉన్నారు.
ఐతే బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) లో ఈ వారం జరిగిన టికెటు టు ఫినాలె గెలిచి అవినాష్ ఆల్రెడీ మొదటి ఫైనలిస్ట్ గా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక సీజన్ 8 టైటిల్ రేసులో ఇద్దరు మాత్రం పోటా పోటీగా దూసుకెళ్తున్నారు. సీజన్ లో మొదటి నుంచి ఉన్న నిఖిల్ (Nikhil) తో పాటు వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం ఇద్దరు టైటిల్ రేసులో ఉన్నారు.
సీజన్ టైటిల్ విన్నర్..
ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవుతారు. గౌతం (Gautham) కు సపోర్ట్ చేసే వాళ్లు ఇది తెలుగు బిగ్ బాస్ కన్నడ వాళ్లను ఎలా గెలిపించకూడదని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటే.. నిఖిల్ మొదటి నుంచి ఉన్నాడు. అతను టైటిల్ (Title Winner) రేసుకి అర్హుడని కొందరు అంటున్నారు. మొత్తానికి సీజన్ 8 టైటిల్ రేసు ఈ ఇద్దరి మధ్యే అని తెలుస్తుంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండేలా ఉంది. ఈ వారం రోహిణి తప్ప మిగతా అందరు నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే అవినాష్ కు టికెట్ టు ఫినాలె వచ్చినా నామినేషన్స్ నుంచి సేఫ్ అయితేనే తను ఫైనలిస్ట్ అవ్వగలడు.
Also Read : Prabhas : ప్రభాస్ ఫౌజికి మరో హీరోయిన్ అవసరపడుతుందా.. హను ప్లానింగ్ ఏంటో..?