Site icon HashtagU Telugu

Bigg Boss Season 8 : బిగ్ బాస్ 8 హోస్ట్ విషయంలో మైండ్ బ్లాక్ ట్విస్ట్.. మార్పు మంచిదేనా..?

Bigg Boss 8 Telugu vs Kannada

Bigg Boss 8 Telugu vs Kannada

Bigg Boss Season 8 బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతున్న ఈ టైం లో సీజన్ హోస్ట్ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐతే సీజన్ 8 హోస్ట్ మారుతున్న విషయం నిజమే అని స్వయానా ఆ హోస్ట్ సోషల్ మీడియాలో ప్రకటించడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఐతే ఇది జరిగేది తెలుగు బిగ్ బాస్ లో కాదని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. తమిళ బిగ్ బాస్ కూడా 7 సీజన్లు పూర్తి చేసుకుంది.

త్వరలో 8వ సీజన్ మొదలు పెట్టాల్సి ఉంది. ఈ టైం లో ఇక మీదట బిగ్ బాస్ హోస్ట్ చేయడం కుదరదని వెల్లడించారు కమల్ హాసన్. వరుస సినిమాల కమిట్మెంట్ వల్ల బిగ్ బాస్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుందని చెప్పారు.

ఐతే తమిళ బిగ్ బాస్ కు ఇప్పుడు ఒక హోస్ట్ (Host) అవసరం ఉంది. ఐతే అది ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ ను అక్కడ స్టార్ హీరో శింబు హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా శింబు దాదాపు కన్ ఫర్మ్ అని అంటున్నారు. శింబు హోస్ట్ గా అనగానే ఆయన ఫ్యాన్స్ అంతా కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు.

తెలుగు బిగ్ బాస్ లో కూడా ఎన్ టీ ఆర్ మొదటి సీజన్ చేయగా నాని రెండో సీజన్ హోస్ట్ గా చేశారు. ఇక 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 7 వరకు నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా కొనసాగుతున్నారు. సీజన్ 8 కూడా ఆయనే హోస్ట్ గా చేయబోతున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ లో మాత్రం హోస్ట్ మారుతున్నాడు. శింబు ఈ ఆఫర్ ను ఓకే చేస్తాడా లేదా మరొకరిని తీసుకుంటారా అన్నద్ తెలియాల్సి ఉంది.

Also Read : Akhil : అఖిల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!