బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది. రోజు రోజుకు ఈ సీజన్ విపరీతంగా అలరిస్తుంది..సీరియల్ బ్యాచ్ , రైతు బిడ్డ , పాట బిడ్డ , సినీ స్టార్స్ ఇలా అంత కూడా సందడి చేస్తూ వచ్చారు. ఇక బిగ్ బాస్ సైతం గత సీజన్ తప్పులు జరగకుండా మొదటి నుండి చక్కటి ప్లాన్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. టెన్షన్ పెట్టె నామినేషన్స్ , రసవత్తరగా సాగే గేమ్స్ , మధ్య మధ్యలో శోభా, ప్రియాంక ల అందాల ఆరబోత ఇలా అందరికి సమపాలనలో న్యాయం చేస్తూ షో సక్సెస్ అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సీజన్ (Bigg Boss Season 7)లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు ఎలిమినేట్ అయ్యారు. ఇక 11 వ వారం శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో యావర్ ఉంటె లాస్ట్ ప్లేస్ లో శోభా శెట్టి, ప్రియాంక లు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారనేది చూడాలి.
ఇదిలా ఉంటె ఈ సీజన్ రేటింగ్ లో దూసుకెళ్తుంది. బార్క్ వెబ్ సైట్ విడుదల చేసిన రేటింగ్స్ (Bigg Boss Season 7 Rating) బట్టి చూస్తే ,.. బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రెండు స్థానాల్లో ఉంది. వీకెండ్ 6.9 టీఆర్పీ , వీక్ డేస్ లో ఇది 4.91 గా రాబడుతుంది. ఇక మూడో స్థానం సైతం స్టార్ మా దక్కించుకుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ఉంది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి 4.24 టీఆర్పీ నమోదు అయ్యింది. నాలుగో స్థానంలో ఈటీవీకి చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది. 3.54 రేటింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అందుకుంది. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ 5,6 స్థానాలకు పడిపోయాయి.
Read Also : Sai Dharam Tej : అభిమాని ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో సాయి తేజ్