Site icon HashtagU Telugu

BiggBoss 6: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. టాస్క్ ఓడిపోవడంతో సింగర్ రేవంత్ రచ్చ!

Singer Revanth

Singer Revanth

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అరుపులు రోజురోజుకీ మరింత ఎక్కువ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఇక్కడ కోప్పడాలో ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏ విధంగా ఉండాలో తెలిస్తేనే బిగ్ బాస్ లో చివరి వరకు కూడా రాణించగలుగుతారు. లేదంటే ఒకటి రెండు మూడు వారాల్లోనే బయటకు వచ్చేస్తారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సింగర్ రేవంత్ నానా హంగామా చేస్తూ వార్తలు నిలుస్తున్నాడు.

హౌస్ లో బూతులు మాట్లాడడం మధ్యలోకి దూరడం అందరిపై గట్టిగా అరవడం ఫైర్ అవడం ఇలా పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు. అయితే తన తప్పులను ఒప్పుకోవడంలో మాత్రం రేవంత్ వెనకడుగు వేడు అని చెప్పవచ్చు. తనపై ఎంతమంది తప్పులు ఎత్తి చూపించినా కూడా శాంతంగా స్పందిస్తూ ఉంటాడు. సరే సరిదిద్దుకుంటాను అంటూ చెబుతూ ఉంటాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా రేవంత్ తన కోపాన్ని తీవ్రస్థాయిలో చూపించాడు. తాజాగా బిగ్ బాస్ ప్రోమోని విడుదల చేశారు. ఆ వీడియోని బట్టి చూస్తే ఒక టాస్క్ లో రేవంత్ ఓడినట్లు కనిపిస్తున్నాడు. ఫైమా, చంటి లతో కలిసి ఆట ఆడగా రేవంత్ ను ఓడించినట్టు తెలుస్తోంది.

దీంతో హర్ట్ అయిన రేవంత్ చలాకీ చంటి తప్పుగా ఆడాడు.. అలా ఆడితే ఎవడైనా గెలుస్తాడు అంటూ కోపం లో నానాలకాల మాటలు అన్నాడు. ఇక మధ్యలో ఆది రెడ్డి చేయి అందించడానికి వచ్చినా కూడా చెయ్యి లాగే పెట్టి కొట్టేశాడు. హౌస్ లో చివరికి పైమా కూడా తనని టార్గెట్ చేయడంతో బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. బాగా ఆడావు అంటూ ఫైమా పై కూడా సెటైర్లు వేశాడు. గెలవడానికి ఆడు కానీ పక్క వాళ్ళని ఓడించడానికి ఆడకూడదు అని రేవంత్ పైమా పై పైరయ్యాడు.

Exit mobile version