Site icon HashtagU Telugu

Bigg Boss Season 6: వీడియో చూపించు మరి సూర్యకి వార్నింగ్ ఇచ్చిన నాగ్?

Bigg Boss Season 6

Bigg Boss Season 6

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతోంది. చూస్తుండగానే అప్పుడే నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. రేపు అనగా ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ లో 4వ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. మరి నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా ఒక డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పై అందరి ఫోటోలు పెట్టి బాక్సింగ్ గ్లౌజ్ తో కొందరి ఫోటోలను పగలగొట్టాడు. ఈ నేపథ్యంలోనే బాల ఆదిత్య ఫోటో పగలగొట్టడంతో బాలాదిత్యకు కోపం వచ్చింది అంటూ కామెడీగా మాట్లాడుతాడు నాగార్జున. బాలాదిత్యా నీకు కోపం రావడం ఎంత సహజమో ఇంకొకరికి దుఃఖం వచ్చింది అదంతా వెంటనే గీతూ లేచి బాలాదిత్య తో కాసేపు వాదిస్తుంది. ఆ తర్వాత హోస్ట్ నాగార్జున బాలాదిత్యకు గట్టిగా క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత విజువల్ ప్లీజ్ బిగ్ బాస్ అనడంతో బిగ్ బాస్ రేవంత్ అన్నాన్ని కింద పడేసిన వీడియో చూపిస్తాడు.

అప్పుడు నాగార్జున సూర్య నువ్వు అన్నం పారేసావు చూసావా ఆ అన్నం లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు అంటూ గట్టిగా క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి కీ క్లాస్ పీకుతూ ఫుడ్ విషయంలో ఏ పనిష్మెంట్ ఇవ్వను. ఎందుకంటే అందరికీ తక్కువ ఫుడ్ ఉంది. ఇలాంటివన్నీ చెప్పావు కదా మాకు ఆడియన్స్ కు అనడంతో ఆది రెడ్డి అవును అని తల ఊపుతూ ఎస్సార్ అని అనడంతో వెంటనే నాగార్జున మరి ఈ వారం ఏమి పీకావు అని ముఖం మీద అనేస్తాడు. దాంతో ఆదిరెడ్డి తలదించుకుంటాడు.

Exit mobile version