Site icon HashtagU Telugu

Prince Yawar Nayani Pawani Love : ప్రిన్స్ యావర్ తో లవ్.. నయని పావని ఏమంటుంది అంటే..?

Bigg Boss Prince Yawar Nayani Pawani Love.. What She Replies

Bigg Boss Prince Yawar Nayani Pawani Love.. What She Replies

Prince Yawar Nayani Pawani Love బిగ్ బాస్ సీజన్ 7 తో పాపులర్ అయిన ప్రిన్స్ యావర్ నయని పావని ఇద్దరు ఆ షో తర్వాత కూడా కలిసి కనిపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 3 గా నిలిచిన ప్రిన్స్ యావర్.. ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నయని పావని ఇద్దరు కలిసి ఆఫ్టర్ బిగ్ బాస్ కలిసి స్పెషల్ వీడియోస్ చేస్తున్నారు. నయని పావని వచ్చిన వారం రోజులోనే హౌస్ ని వీడినా వారం లోనే ఆమె హౌస్ మెట్స్ కి దగ్గరైంది.

శివాజిని డాడీ అంటూ పిలిచి ఎమోషనల్ అయిన నయని ప్రిన్స్ యావర్ తో క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఈ ఇద్దరు కలిసి ఈమధ్య వీడియో సాంగ్స్ చేస్తున్నారు. గుంటూరు కారం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కి కూడా డ్యాన్స్ చేశారు. అయితే ఈ ఇద్దరి క్లోజ్ నెస్ చూసి నయని పావని, యావర్ ప్రేమలో ఉన్నారని కామెంట్స్ మొదలయ్యాయి. ఇదే విషయాన్ని నయని పావనిని అడిగారు.

నయని పావని ఈమధ్య తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేయగా యావర్ తో రిలేషన్ ఏంటి..? యావర్ ని ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే దానికి స్పందించిన నయని పావని మీకు ఎన్నిసార్లు చెప్పాలి. యావర్ నేను మంచి స్నేహితులం మాత్రమే. మీకు ఇవి తప్ప వేరే ప్రశ్నలు లేవా అని ఫైర్ అయ్యింది. ఇద్దరు కలిసి కాస్త క్లోజ్ గా కనిపిస్తే రిలేషన్ షిప్ అంటగట్టడం కామనే కానీ ఈ కామెంట్స్ నే నిజం చేసేలా వారి ఫ్యూచర్ ప్లాన్ ఉంటే మాత్రం ఆడియన్స్ మరింత ఆడుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read : Heroines Back to Form : సీనియర్ భామలంతా తిరిగి ఫాం లోకి.. అనుష్క టు శృతి.. సమంత త్రిష కూడా.!