Bigg Boss Nonstop : బిగ్ బాస్ నాన్ స్టాప్ వద్దు.. సీజన్ ను త్వరగా మొదలు పెట్టడంటున్న ఆడియన్స్..!

Bigg Boss Nonstop బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అవ్వడంతో బిగ్ బాస్ మీద మళ్లీ ఆడియన్స్ క్రేజ్ పెరిగింది. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ

Published By: HashtagU Telugu Desk
Bigg Boss Nonstop Ott Second Season Is On Hold

Bigg Boss Nonstop Ott Second Season Is On Hold

Bigg Boss Nonstop బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అవ్వడంతో బిగ్ బాస్ మీద మళ్లీ ఆడియన్స్ క్రేజ్ పెరిగింది. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ సెకండ్ సీజన్ మొదలు పెట్టాలని అనుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. అప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో బిగ్ బాస్ చూడాలి అనుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. కానీ బిగ్ బాస్ సీజన్ 7 ని ఎక్కువమంది డిస్నీ హాట్ స్టార్ లోనే చూశారు.

సో ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ కి బాగా ఎంగేజ్ అవుతారని అనుకున్నారు. బిగ్ బాస్ టీం ప్లాన్స్ ఇలా ఉంటే ఓటీటీ సీజన్ కి వచ్చేందుకు కంటెస్టెంట్స్ ఎవరు అంతగా ఆసక్తి చూపించట్లేదని టాక్. సీజన్ 7 కి సంబందించిన ఇద్దరు ముగ్గురిని ఈ షోలో తీసుకోవాలని అనుకున్నా వాళ్లు కూడా కాదు పొమ్మని అన్నారట.

బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ విషయంలో మేకర్స్ ప్లాన్ అలా ఉంటే ఆడియన్స్ మాత్రం ఎవరెవరినో తెచ్చి ఓటీటీ 2 చేసేలా అయితే వద్దని అంటున్నారు. టీవీలో టెలికాస్ట్ చేసేలా అయితే బిగ్ బాస్ మొదలు పెట్టండి లేదంటే వద్దని అంటున్నారు. సో పరిస్థితిని బట్టి చూస్తుంటే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ లేనట్టే అంటున్నారు.

  Last Updated: 03 Feb 2024, 12:16 PM IST