ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఒకటైన బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాషల్లో విజయవంతంగా నడుస్తుంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 నడుస్తుంది. ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి షోని మరింత రసవత్తరంగా చేశారు. తమిల్ లో కూడా బిగ్ బాస్ సీజన్ 8 ని కమల్ కి బదులుగా విజయ్ సేతుపతిని హోస్ట్ గా పరిచయం చేస్తూ మొదలు పెట్టారు. అది కూడా రెండు వారాలు కావొస్తుంది.
Bigg Boss హిందీలో ప్రస్తుతం 18వ సీజన్ నడుస్తుంది. సో అన్ని భాషల్లో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఐతే బిగ్ బాస్ కన్నడ (Bigg Boss Kannada)ను దాదాపుగా 11 ఏళ్ల నుంచి అక్కడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా చేయడం అన్నది అంత ఈజీ థింగ్ అయితే కాదు కానీ ఓ పక్క సినిమాలు మరోపక్క బిగ్ బాస్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు సుదీప్.
బిగ్ బాస్ కన్నడకు కిచ్చ సుదీప్..
ఐతే మీదట బిగ్ బాస్ కన్నడకు కిచ్చ సుదీప్ (Kiccha Sudeep) హోస్ట్ గా చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఈ విషయాన్ని సుదీప్ స్వయంగా ప్రకటించాడు. సీజన్ 11 తర్వాత సీజన్ 12 ని వేరే హీరోతో చేయించే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. తెలుగులో కూడా ఫస్ట్ సీజన్ తారక్ (NTR), రెండో సీజన్ నాని (Nani) చేయగా 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున (Nagarjuna) ఎంట్రీ ఇచ్చి సీజన్ 8 కాదు ఎన్ని సీజన్లు అయినా నేను రెడీ అనేలా ఉన్నాడు మన కింగ్.
సీజన్ 11లో కన్నడ స్టార్ వీడటంతో అక్కడ హోస్ట్ గా ఎవరు చేస్తారా అని డిస్కషన్స్ మొదలు పెట్టారు. మరి సీజన్ 12 హోస్ట్ ఎవరు హోస్ట్ అవుతారు.
Also Read : Nitya Menon : నిత్యా మీనన్ ని వదలని స్టార్ హీరో..!