Site icon HashtagU Telugu

Amardeep: హీరోగా నటించబోతున్న అమర్ దీప్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Mixcollage 01 Feb 2024 08 30 Am 6583

Mixcollage 01 Feb 2024 08 30 Am 6583

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి నటుడుగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అమర్ దీప్ ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్బాస్ హౌస్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అవడంతో పాటు బోలెడంత పాపులారిటీని కూడా సంపాదించుకున్నాడు. అయితే చివర్లో గెలుస్తాడు అనుకున్న అమర్ రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరియర్ పరంగా ఎవరికి వారు బిజీ బిజీ అయిపోయారు.

మరి మళ్లీ సీరియల్స్ లో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అభిమానులకు ఒక శుభవార్తను తెలిపారు అమర్ దీప్. అదేమిటంటే హీరోగా ఒక కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం బుల్లితెరపై సందడి చేసిన అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా సందడి చేయబోతున్నాడు. అయితే అమర్ దీప్ సరసన నటించే హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ నది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ముద్దుల కూతురు సుప్రీత. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. సుప్రీత గురించి కూడా మనందరికీ తెలిసిందే. సురేఖ వాణి కూతురుగా ఈమె భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

Jk

ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రీత. తల్లీ కూతురు ఇద్దరుహాట్ హాట్ డ్రస్ లతో,ఇన్ స్టా రీల్స్ స్పెషల్ ఫోటోస్ తో బాగా పాపులర్ అయిపోయారు. ఇక ఈ సినిమాతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నం.2 పూజ కార్యక్రమం నేడు అనగా ఫిబ్రవరి1 న ఉదయం 10 గంటలకి ప్రసాద్ ల్యాబ్ , హైదరాబాద్ లో జరుగుతుంది అని ప్రకటించారు. కాగా ఈ సినిమా M3 మీడియా బ్యానర్లో,మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో వీరితో పాటు సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవింద్ర లాంటి సీనియర్ యాక్టర్స్ నటించబోతున్నారు.