BiggBoss 6: రెండు వారాలకు గాను బిగ్ బాస్ పారితోషికం ఎంతో చెప్పిన అభినయశ్రీ!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కొట్లాటలు, గలాటలు,ఏడుపులతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే బిగ్

Published By: HashtagU Telugu Desk
Abhinaya Sri

Abhinaya Sri

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కొట్లాటలు, గలాటలు,ఏడుపులతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో 2 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. చూస్తుండగానే అప్పుడే రెండు వారాలు గడిచిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మొదటివారం ఎలిమినేషన్ లేదు అంటూ నాగార్జున ప్రేక్షకులకు సాకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రెండవ వారం ఎలిమెంట్ ఎవరు అవుతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక తాజాగా రెండవ వారం ఎలిమినేషన్ కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే.

తాజాగా సండే ఫండీ ఎంతో ఆనందంగా సందడి సందడిగా సాగినప్పటికీ చివర్లో మాత్రం ఒక కంటేస్తే ఎలిమినేట్ చేసి అందరినీ ఏడిపించేసాడు హోస్ట్ నాగార్జున. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారం ఎలిమినేషన్ లో భాగంగా అభినయశ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అంటూ ప్రకటించడంతో స్టేజి మీదకు వచ్చిన అభినయశ్రీ నన్ను ఆదరించే అభిమానులు నన్ను ఇంత తొందరగా బయటకు పంపిస్తారు అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయింది. ఇది ఇలా ఉంటే అభినయశ్రీ ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె రెమ్యూనరేషన్ విషయంలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఇదే వార్తలపై స్పందించింది అభినయశ్రీ. బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత అభినయశ్రీ ప్రతిరోజు 40 వేల రూపాయలు ఆ ప్రకారంగా రెండు వారాలకు కలిపి ఐదు లక్షలకు పైగా తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అని సదరు విలేకర్ అభినయశ్రీ ని ప్రశ్నించగా.. అదంతా అబద్ధం. దేవుడి సాక్షిగా చెబుతున్నాను అదంతా ఏమీ లేదు అని తెలిపింది అభినయశ్రీ. ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను 5 లక్షలు తీసుకున్నాను అనుకుంటే ఆ విషయం చెప్తాను కదా కాబట్టి అదంతా అబద్ధం అని కొట్టి పరేసింది అభినయశ్రీ.

  Last Updated: 19 Sep 2022, 05:20 PM IST