తెలుగు బిగ్ బాస్ 7 (Bigg Boss 7)సీజన్ గత సీజన్ కంటే బాగా అలరిస్తుంది. గత సీజన్ ప్రేక్షకులను , అభిమానులను నిరాశ పరచగా..ఈసారి మాత్రం ‘ఉల్టా-పుల్టా’ అంటూ సీజన్ మొదటి నుండి అలరిస్తూ వస్తున్నారు. సీరియల్ బ్యాచ్ తో పాటు రైతు బిడ్డ , పాట బిడ్డ లను తీసుకొచ్చి షో ను రక్తికట్టిస్తున్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. గత వారం సందీప్ మాస్టర్ (Sundeep Master) ఇంటినుండి వెళ్లగా…ఈ వారం ఎవరు వెళ్తారనేది ఆసక్తి గా మారింది. ఎప్పటిలాగానే సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. వారం అంత ఓ ఎత్తు..సోమవారం నామినేషన్ ఓ ఎత్తు. సభ్యుల్లో ఉండే అసలైన స్వరూపం సోమవారం బయటపడుతుంటుంది. ఈరోజు కూడా అదే జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకున్నారో.. వాళ్లని డ్రాగన్ స్నేక్ ( ‘Dragon Snake’ ) దగ్గర నిలబెట్టాలని.. అలా ఒక్కొక్కరు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తారు. ముందుగా పల్లవి ప్రశాంత్… అమర్ దీప్‌ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య.. మాటల తూటాలు పేలాయి. ఒకసారి కెప్టెన్ అయిన వాడు.. మళ్లీ పోటీలోకి వస్తే.. వాడు ఎవడైనా సరే తీసిపారేస్తా అంటూ డైలాగ్‌లు కొట్టాడు అమర్ . ఆ తరువాత.. ప్రియాంక రతికను నామినేట్ చేస్తుంది. ఆ తరువాత భోలే.. ప్రియాంకను నామినేట్ చేసాడు. ‘మీరు నాకు ఓటు వేశారు’ అని అంటే.. ‘ఓటు కాదు పోటు వేశాను.. పోటుకు ఓటుకి తేడా తెలియడం లేదు నీకు’ అంటూ డైలాగ్ కొట్టాడు.
ఆ తరువాత ఫైరింగ్ శోభాశెట్టి (Shobha)ని …అర్జున్ నామినేట్ చేశాడు. ఎవరైనా తనని నామినేట్ చేస్తే.. తనలోని అసలైన సైకోయిజాన్ని బయటపెట్టే శోభాశెట్టి.. ఈవారం కూడా అదే రిపీట్ చేసింది. అర్జున్‌ని బయటకు తీసుకొస్తా బిగ్ బాస్.. రెడీ పెట్టుకోండి’ అని సవాల్ చేసింది. ఈ ప్రోమో చూసిన వారు మరోసారి శోభా ఫై విరుచుకపడుతున్నారు. అనవసరంగా ఈమెను హౌస్ లో ఉంచుతున్నారు..ఈమెకు బదులు సందీప్ ను హౌస్ లో ఉంచిన బాగుండేదని అంత కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Train Accident History in India : భారత్ లో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదాలు ఇవే..