బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా (Divi Vadthya). ఈ బ్యూటీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో నటిస్తూ.. తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ పాల్గొనే అవకాశం సొంతం చేసుకుంది. ఈ రియల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలాగే ఈ షోలో ఓ రేంజ్లో రచ్చ చేసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడుకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈమె వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచింది.
Thalliki Vandanam : “తల్లికి వందనం” పథకంలో అమల్లో లోకేష్ కీ రోల్
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే (Mangli Birthday Party) పార్టీ వివాదంగా మారింది. మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీపై గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, పార్టీకి పర్మిషన్ లేకపోవడంతో మంగ్లీతో పాటు రిసార్ట్ మేనేజ్‌మెంట్‌పై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
Mangli Issue : నేనేం చేయలే.. నా ఫోటోలు వాడొద్దు..
ఈ పార్టీలో బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య, నటుడు రచ్చ రవి, రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ ఇంద్రావతి తదితర ప్రముఖులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో దివి కనిపించడంతో, ఆమెపై నెగటివ్ ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన దివి.. తనను తప్పుగా చూపించొద్దని మీడియాను కోరింది. “నా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లాను. అక్కడ జరిగిన ఘటనలకు నేను బాధ్యురాలిని కాదు. ఎలాంటి ప్రూఫ్ లేకుండా నా ఫోటోలు వాడకండి” అని విజ్ఞప్తి చేసింది.
డ్రగ్స్ మరియు గంజాయి వినియోగంపై ప్రభుత్వం కఠినంగా ఉండాలని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ పార్టీలో ఎవరైనా ప్రముఖులు ఉన్నా ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నామని, డ్రగ్ టెస్టులు అవసరమైతే కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెలబ్రిటీల ప్రస్థానం కాపాడుకోవాలంటే, వారు హాజరయ్యే కార్యక్రమాలపై స్పష్టత ఉండాలని సామాజికంగా చర్చ మొదలైంది.