Amardeep: అమర్దీప్,సురేఖ వాణి మధ్య అలాంటి రిలేషన్ ఉందా.. సుప్రీతకు ఆఫర్ రావడం వెనుక కారణం ఇదే?

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు,బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7 పాల్గొని రన్నరప్ గా నిలిచారు అమర్ దీప్. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇది ఇలా ఉంటే అమర్ దీప్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Mar 2024 08 56 Am 3905

Mixcollage 20 Mar 2024 08 56 Am 3905

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు,బిగ్ బాస్ అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7 పాల్గొని రన్నరప్ గా నిలిచారు అమర్ దీప్. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇది ఇలా ఉంటే అమర్ దీప్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో అమర్ దీప్ కి జంటగా సుప్రీత నటిస్తోంది. సురేఖా వాణి కూతురైన సుప్రీతకు ఇది డెబ్యూ మూవీ.

సురేఖా వాణి గత కొంత కాలంగా తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అమర్ దీప్ సినిమాతో ఆ కోరిక తీరింది. అమర్ దీప్ తన సినిమాలో సుప్రీతకు ఛాన్స్ ఇవ్వడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయట. ముఖ్యంగా సురేఖావాణితో అమర్ దీప్ కి రిలేషన్ ఉందని సమాచారం. తాజాగా అమర్ దీప్-సుప్రీత దావత్ అనే టాక్ షోకి వచ్చారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా ఉన్న ఈ షోలో ఈ యంగ్ జోడి సందడి చేశారు. ఈ సందర్భంగా అమర్ దీప్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నటి సురేఖావాణితో తనకున్న బంధం బయటపెట్టాడు. అమర్ దీప్ కి సురేఖావాణి బంధువులు అవుతారట.

ఆమె వరసకు అక్క అవుతుందట. ఇక సుప్రీతకు నేను మేనమామ అవుతాను అని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. దాంతో హోస్ట్ రీతూ చౌదరి అమర్ దీప్ ని మామయ్య అని పిలవాలని సుప్రీతకు చెప్పింది. మామయ్యా అంటూ సో క్యూట్ గా పిలిచింది సుప్రీత. అమర్ సిగ్గుపడిపోయాడు.
అలాగే తన సినిమాలో సుప్రీతను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఏమిటో చెప్పాడు అమర్ దీప్. ఆ పాత్రకు సుప్రీత బాగా సెట్ అవుతుందనీ, అందుకే ఎంపిక చేసినట్లు తెలిపారు అమర్ దీప్. ఇక ఈ సినిమా వలన తన కాలేజీ డేస్ గుర్తుకు వస్తున్నట్లు తెలిపారు.

  Last Updated: 20 Mar 2024, 08:57 AM IST