Site icon HashtagU Telugu

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ ఛాన్స్ ఎవరికి ఉంది..!

Bigg Boss 8 Telugu vs Kannada

Bigg Boss 8 Telugu vs Kannada

బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) లో జరిగిన 9 వారాల్లో చూస్తే పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరు ఎవరి ఆట వారు ఆడుతున్నారు. ఐతే ఆదివారం నయని పావని ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో టాప్ 5 తీస్తే మరో ఏడుగురు ఎలిమినేట్ అవ్వాలి లేదా ఆరు వాళ్లో ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉండాలి.

ఐతే ఇప్పటివరకు జరిగిన ఆటని చూసిన ఆడియన్స్ టాప్ 5 లో ఎవరు టైటిల్ విజేతగా ఎవరికి ఛాన్సులు ఉన్నాయన్నది చర్చిస్తున్నారు.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 5..

9 వారాలు పూర్తయ్యే సరికి దాదాపు కంటెస్టెంట్స్ ఎవరు ఎలాంటి వారు.. ఎవరి ఆట ఎలా ఉంది అన్నది అర్ధమైంది. ఐతే ప్రస్తుతానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 5 గా నిఖిల్ (Nikhil), ప్రేరణ, పృధ్వి, అవినాష్, తేజ ఉన్నారు. యష్మి తో పాటు రోహిణికి కూడా టాప్ 5 ఛాన్స్ ఉంది. ఐతే ఇంకా ఆట ఆరు వారాలు ఉంది కాబట్టి అప్పటివరకు ఈ లిస్ట్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

మరోపక్క ఈ సీజన్ టైటిల్ విన్నర్ (Title Winner) ఎవరన్నది కూడా చెప్పడం కష్టం గానే ఉంది. ఓటింగ్ పరంగా నిఖిల్ టాప్ లో ఉన్నాడు. అతనికి పోటీగా ప్రేరణ కూడ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించింది. ఈ ఇద్దరిలోనే టైటిల్ విన్నర్ ఉండొచ్చని అంటున్నారు. మరోపక్క గౌతం కి కూడా ఈమధ్య ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి టైటిల్ ఎవరిది అన్నది ఇప్పుడే చెప్పడం కష్టమవుతుంది.

Also Read : Boycott Pushpa 2 : పుష్ప 2ని బాయ్ కాట్ చేస్తామంటున్న కన్నడిగులు.. ఎందుకో తెలుసా..?