బిగ్ బాస్ సీజన్ 8 లో సీరియల్ బ్యాచ్ కాకుండా యాంకర్ గా ఆడియన్స్ అందరికీ పరిచయం ఉన్న విష్ణు ప్రియ ఒక కంటెస్టెంట్ గా వెళ్లింది. ఐతే ఆమె వారాలు గడుస్తున్నా కొద్ది ఆడియన్స్ ని విసుగిస్తుంది తప్ప మరేమి చేయట్లేదని అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో గడిచిన ఈ 9 వారాల్లో విష్ణు ప్రియ (Vishnu Priya) గట్టిగా ఆడిన టాస్కులు ఒకటి రెండు తప్ప మరేమి లేదు.
ఎప్పుడు ఆ పృధ్వితో ఉండటం అతన్ని ముద్దు చేయడం.. అతన్ని ఆరాధించడం తప్ప మరేమి చేయట్లేదు. అసలు విష్ణు ప్రియ హౌస్ లో ఏం చేయడానికి వెళ్లింది.. ఏం చేస్తుంది అన్నది అర్ధం కాక ఆడియన్స్ తలగోక్కునే పరిస్థితి వచ్చింది. వీక్ డేస్ లో ఎలా ఉన్నా వీకెండ్ లో నాగార్జున ముందు మాత్రం చిన్న పిల్లలా ప్రవర్తించి నవ్వి మార్కులు కొట్టేస్తుంది.
ఆట ప్రకారం చూస్తే ఆమె హౌస్ లో..
మరి వారం మొత్తం లేని ఎనర్జీ వీకెండ్ లోనే ఎలా వస్తుందో ఆమెకే తెలియాలి. బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) లో ఇప్పటివరకు చాలామంది ఎలిమినేట్ కాగా విష్ణు ప్రియ ఆట ప్రకారం చూస్తే ఆమె హౌస్ లో ఉండటానికి అసలేమాత్రం అర్హత లేదని ఆడియన్స్ చెబుతున్నారు. తను కేవలం పృధ్వి(Prudhvi) తో పులిహోర కలపడానికి మాత్రమే తప్ప హౌస్ లో పెద్దగా చేస్తుంది ఏమి లేదని తెలుస్తుంది.
బిగ్ బాస్ టీం కూడా ఇది మంచి స్టఫ్ కాబట్టి కొన్నాళ్లు ఉంచుదాం అని చూస్తున్నారు. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కాస్త ఎఫర్ట్ పెట్టి ఆట ఆడితే మాత్రం మంచి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూసేలా చేస్తుంది.
Also Read : Vijay Devarakonda : హాలీవుడ్ స్టార్ ని దించుతున్న విజయ్ దేవరకొండ..!