Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో 10వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది లీక్ అయ్యింది. అసలైతే డేంజర్ జోన్ లో ఇద్దరు హౌస్ మెట్స్ ఉండగా ఒకరిని సేఫ్ చేసి మరొకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన బోలే శావలి ఒకసారి ఎలిమినేట్ అయ్యి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక ఇద్దరు ఈ వారం లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. అయితే ఇద్దరిలో బోలే శావలి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. పాట బిడ్డగా హౌస్ లో తన పాటలతో అలరిస్తూ వచ్చిన బోలే శావలి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
అయితే లీకైన ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బిగ్ బాస్ ఆడియన్స్ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని రతిక కన్నా బోలేకే ఎక్కువ ఓటింగ్స్ వచ్చాయని బిగ్ బాస్ టీం రతికని కావాలని సేవ్ చేస్తున్నారని అంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత కూడా రతిక పెద్దగా ఆట ఆడింది ఏమి లేదు. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వని రతికనే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ అది జరగలేదు. బోలే శావలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
Also Read : Plane Ticket – Rs 108 : ఆ రెండు గంటలు.. రూ.108కే విమానం టికెట్లు.. ఏమైందంటే ?
10 వారాల హౌస్ లో జర్నీ ముగించిన కంటెస్టెంట్స్ ఇంకా ఐదు వారాలు హౌస్ లో ఉండాల్సి ఉంటుంది. ఈ ఐదు వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు టాప్ 5 కి వెళ్తారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఎవరికి వారు తమ 100 పర్సెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 10 మందిలో టాప్ 5 కి ఎవరు చేరుకుంటారో చూడాలి.
ఈ వారం కెప్టెన్ గా శివాజి అయ్యారు. అర్జున్, శివాజిల మధ్య పోటీ రాగా హోస్ట్ నాగార్జున హౌస్ మెట్స్ నిర్ణయం ప్రకారం ఈ వారం కెప్టెన్ గా శివాజిని ఎంపిక చేశారు. అంతేకాదు శివాజికి హెడ్ వెయిట్ పెరిగిందని కూడా అన్నారు నాగార్జున. మరి ఆ హెడ్ వెయిట్ ని శివాజి ఆటలో తగ్గించుకుంటాడా లేదా అన్నది చూడాలి.
We’re now on WhatsApp : Click to Join