Site icon HashtagU Telugu

Bigg Boss 7 Telugu Winner : పల్లవి ప్రశాంత్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా..?

Bigg Boss 7 Telugu Winner

Bigg Boss 7 Telugu Winner

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss 7 Telugu ) గ్రాండ్ గా ముగిసింది..అంత భావించినట్లే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Raithu Bidda Pallavi Prashanth) టైటిల్ విన్నర్ గా కప్ గెలుచుకున్నాడు. కేవలం కప్ మాత్రమే కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. నార్త్ లో సూపర్ సక్సెస్ సాధించిన బిగ్ బాస్ (Bigg Boss)..సౌత్ లో కూడా అంతే ఆదరణతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో..ఈరోజు తో ఏడో సీజన్ కూడా పూర్తి చేసుకుంది. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ మొదటి నుండి కూడా అలరిస్తూ టాప్ రేటింగ్ తో కొనసాగుతూ వచ్చింది. సీరియల్ బ్యాచ్ , రైతు బిడ్డ , పాట బిడ్డ , సినీ స్టార్స్ ఇలా అంత కూడా ఈ సీజన్ లో సందడి చేసారు.

గత సీజన్ కంటే ఎంతో గ్రాండ్ గా ఈ సీజన్ సాగింది. మొదటి నుండి ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటూ..అలరిస్తూ వచ్చింది. ఈ సీజన్ విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Raithu Bidda Pallavi Prashanth) విన్నర్ అవుతాడని అంత భావించారు..అదే జరిగింది. మొదటి నుండి ప్రశాంత్ ను టైటిల్ విన్నర్ గా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అదే విధంగా ప్రశాంత్ కూడా అదే ఆటతో ఆకట్టుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం.. కష్టపడితే రాదా ఫలితం.. లక్ష్యమంటూ లేని జన్మే దండగా.. లక్షలాది మంది లేదా మందగా.. పంతం పట్టీ పోరాడందే.. చేస్తూ ఉంటే ఏ పనైనా సాద్యమే.. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే.. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా.. ఎక్కలేని కొండనేదీ లేదురా.. నవ్వే వాళ్ళు నివ్వెరపోగా.. దిక్కులు జెయించి సాగిపోరా’’.. అంటూ సిరివెన్నెల రాసిన ఈ పదాలు..రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు సరిగ్గా సరిపోతాయి. బిగ్ బాస్ లో ఎలాగైనా వెళ్లాలని పట్టుదలతో తన ప్రయాణం మొదలుపెట్టాడు..సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరిని వేడుకుంటూ..చివరికి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడమే కాదు ఈరోజు టైటిల్ విన్నర్ గా కప్ గెలుచుకొని ఇంటికి వెళ్లాడు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా చరిత్ర సృష్టిచడమే కాదు.. దేశ చరిత్రలో ఒక కామన్ మెన్‌ గా హౌస్ లోకి వెళ్లి, బిగ్ బాస్ విన్నర్ అవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అన్ని భాషల బిగ్ బాస్ సీజన్ లలో సెలబ్రటీస్ మాత్రం హౌస్ కు వెళ్లడం..కప్ గెలుచుకోవడం చేసారు. కానీ తెలుగు సీజన్ 7 మాత్రమే కామన్ మాన్ వెళ్లి కప్ గెలుచుకున్నాడు.

‘బిగ్ బాస్’ సీజన్ 7లో టాప్ 2 కంటెస్టెంట్స్‌గా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ నిలువగా.. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వారిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి… అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్‌గా ప్రకటించాడు. ప్రైజ్ మనీ 50లక్షలు అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. అందులోంచి యావర్ 15లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో టైటిల్ విన్నర్ అయిన ప్రశాంత్ కు 35 లక్షల నగదు బహుమతి లభించింది. నగదు బహుమతితో పాటు, 15 లక్షల జోయాలుక్కాస్ నెక్లెస్ , ఒక బ్రీజా కారు దక్కించుకున్నాడు. తనకు వచ్చిన రూ.35 లక్షల డబ్బును రైతులకు ఇస్తానని, నెక్లెస్ ను అమ్మకు ఇస్తానని , కార్ ను నాన్న కు ఇస్తానని వేదిక ఫై ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

అంతకు ముందు శివాజీ ఎలిమినేట్ కాగానే కాళ్ల మీద పడి ప్రశాంత్ అసలు వదల్లేదు. వద్దురా బాబు వెళ్లనీ అన్నా కూడా కన్నీళ్లు పెట్టుకొని అలానే పట్టుకొని ఉండిపోయాడు. హౌస్ లో శివాజీ , యావర్, ప్రశాంత్ ల స్నేహం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. శివాజీ వల్లే ఈరోజు ప్రశాంత్ కప్ గెలుచుకోగలిగాడు. అందులో నో డౌట్. ఏది ఏమైనప్పటికి పల్లవి ప్రశాంత్ కప్ గెలుచుకోవడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Chiranjeevi : చిరంజీవి బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే..