Site icon HashtagU Telugu

Tejaswini Gowda: శివాజీ ప్రవర్తనకి బాధపడ్డాను.. అమర్ కి అలాంటి సమస్యలు ఉన్నాయి : తేజస్విని గౌడ

Mixcollage 02 Dec 2023 06 58 Pm 6722

Mixcollage 02 Dec 2023 06 58 Pm 6722

ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నటుడు నటుడు అమర్‌దీప్‌ చౌదరి కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మొదటినుంచి తెలివిగా గేములు ఆడుతూ ప్రస్తుతం టైటిల్ రేస్ లో ఉన్నారు అమర్. కాగా హౌస్‌లో శివాజీ మొదటి నుంచీ అమర్‌ను టార్గెట్‌ చేస్తూ అతడిని చులకన చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఈ వైఖరిని తాను కూడా సహించలేకపోయాను అంటోంది అమర్‌ భార్య, నటి తేజస్విని. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని ఎన్నో విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తేజస్విని గౌడ మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో శివాజీ ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను.

ఎందుకలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. బహుశా అమర్‌ టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తాడనుకున్నారేమో, అందుకే తనతో అలా ప్రవర్తించారేమో, నేను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లినప్పుడు చాలా అనుకున్నాను. ఎన్నో చెప్పాలి అనుకున్నాను. కానీ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఏదీ గుర్తులేదు. అమర్‌ తప్ప ఎవరూ కనిపించలేదు. తనే అందరినీ పరిచయం చేశాడు. అమర్‌కు శివాజీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు, ఆశీర్వాదం తీసుకున్నాము అని చెప్పుకొచ్చింది తేజస్విని. అనంతరం అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ.. అమర్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. బిగ్‌బాస్‌ షోలోకి వెళ్లేముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్‌ పెయిన్‌ ఉంది.

హౌస్‌లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతడికి ఫిజియోథెరపీ జరిగింది. నీతోనే డ్యాన్స్‌ షో ఫినాలే రోజు పెయిన్‌ కిల్లర్స్‌ ఇంజక్షన్స్‌ వేయించుకున్నాడు. అంత నొప్పి అనుభవిస్తూనే షోకి వెళ్లాడు. ఇప్పటికీ అతడు నొప్పి అనుభవిస్తున్నాడు. హౌస్‌లో తనకు వెన్ను నొప్పి ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఏ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం లేదు. ఎక్కడ సింపతీ అనుకుంటారోనని తన అనారోగ్య సమస్యను ఎవరికీ చెప్పట్లేదని నాకు చెప్పాడు. తనకు నొప్పి తగ్గడానికి డాక్టర్‌ రాసిచ్చిన క్రీమ్‌ పంపిస్తూనే ఉన్నాను. అమర్‌ రోజూ అది రాసుకునే పడుకుంటున్నాడు. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. దీనివల్ల ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్‌ అవుతుందని డాక్టర్‌ చెప్పారు అని చెప్పుకొచ్చింది తేజస్విని గౌడ.