Bigg Boss 7 : హౌస్ లో ఆమెకు ఐలవ్యూ అని చెప్పిన తేజ.. మామూలోడు కాదండోయ్..!

Bigg Boss 7 బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్. అది షో కోసమా లేక నిజంగానే కనెక్ట్ అవుతారా అన్నది తెలియదు కానీ బిగ్ బాస్ షో ప్రతి సీజన్

Published By: HashtagU Telugu Desk
Bigg Boss 7 Tasty Teja Love Proposal To Sobha Shetty

Bigg Boss 7 Tasty Teja Love Proposal To Sobha Shetty

Bigg Boss 7 బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్. అది షో కోసమా లేక నిజంగానే కనెక్ట్ అవుతారా అన్నది తెలియదు కానీ బిగ్ బాస్ షో ప్రతి సీజన్ లో ఏదో ఒక జంట క్లోజ్ అవడం చూస్తూనే ఉన్నాం. అయితే వారు బయటకు వెళ్లాక కలిసి ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. ప్రతి సీజన్ లో కొన్ని వారాలుగా ఉండటం వల్ల ఎమోషనల్ గా కనెక్ట్ అవడం బయటకు వెళ్లాక నిజం తెలుసుకోవడం తెలుస్తుంది.

బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 లో కూడా అలాంటి కొన్ని ప్రేమ కథలు మొదలయ్యాయి. అయితే కొన్ని మొదట్లోనే ఎండ్ అవగా ఒక జంట మాత్రం హౌస్ లో తమ లవ్ స్టోరీని కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు లేనిది ఏకంగా ఒక హౌస్ మెట్ కి ఐలవ్యూ అని కూడా చెప్పేశాడు. ఇంతకీ ఎవరు ఐలవ్యూ చెప్పింది అంటే టేస్టీ తేజ (Tasty Teja) అని తెలుస్తుంది. అతను చెప్పింది ఎవరికో ఈపాటికే ఆడియన్స్ కూడా గెస్ చేసేయొచ్చు.

ఈ సీజన్ లో తేజా, శోభా శెట్టి (Sobha Shetty) అదేనండి కార్తీక దీపం మోనిత ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. తేజతో బిగ్ బాస్ కూడా శోభా పేరుతో ఆడుకుంటున్నాడు. శోభ పేరుని తేజ టాటూ వేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే తేజ దానికి ఒప్పుకోలేదు. అయితే ముందుంది ముసళ్ల పండుగ అని శోభా శెట్టి పేరు మీద ఒక కేక్ పంపించాడు. అయితే ముందు వాళ్లిద్దరు కట్ చేసి మిగతా అంతా కూడా హౌస్ మెట్స్ కి పంచారు.

ఈ క్రమంలో కేక్ కటింగ్ అయ్యాక శోభా కి ఏదో చెబుతూ ఐలవ్యూ అని చెప్పాడు తేజ. అయితే శోభ మాత్రం చీ అనుకుంటూ వెళ్లింది. మరి తేజ ఐలవ్యూ చెప్పిన విషయంపై నాగార్జున మాట్లాడుతారో లేదో చూడాలి. హౌస్ లో ఐలవ్యూ అని చెప్పిన మొదటి హౌస్ మెట్ టేస్టీ తేజానే అని చెప్పొచ్చు.

Also Read : Raviteja : టైగర్ నాగేశ్వరావు డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

  Last Updated: 20 Oct 2023, 08:55 PM IST