బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss7) నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. ఈ వారం హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో రతిక, ప్రియాంకా, యావర్, తేజా, గౌతం కృష్ణ, శుభ శ్రీ ఉన్నారు. ఈసారి నామినేషన్స్ (Nominations) విషయంలో కేవలం నామినేట్ చేసే కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా జ్యూరీ లుగా ఉన్న శివాజి, సందీప్, శోభా శెట్టిలను కూడా కన్విన్స్ చేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటిలానే వాదనలు జరిగాయి.
యావర్, గౌతం మళ్లీ గొడవ పడ్డారు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడారు. ఫైనల్ గా ఈ వారం ఆరుగురిలో అందరు స్ట్రాంగ్ గా అనిపించే వారే ఉన్నారు. అయితే ఈ వారం ఉన్న ఆరుగురిలో రిస్క్ ఎవరికి అన్నది చూస్తే.. ఇద్దరికి మాత్రమే ఉందని అంటున్నారు. యావర్, ప్రియాంక ఓటింగ్ లో బాగానే ముందుకు వెళ్తున్నారు. మరోపక్క గౌతం కృష్ణ, శుభ శ్రీ కూడా పర్వాలేదు అనిపించుకుంటున్నారు. ఎటొచ్చి టేస్టీ తేజా, రతికల ఈ ఇద్దరిలో ఒకరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అయ్యేలా అవకాశం ఉందని అంటున్నారు.
ఆల్రెడీ బిగ్ బాస్ (Bigg Boss7) ఆడియన్స్ అంతా కూడా ఈ వారం ఎవరిని బయటకు పంపించాలి అన్నది ఆల్రెడీ ఫిక్స్ అయ్యారన్నట్టు తెలుస్తుంది. హౌస్ లో ఆట ఆడకుండా బయట ఉన్న సెలబ్రిటీ పేరు వాడుతూ ఆట ఆడలేకపోతున్నా అనే ఒక కంటెస్టెంట్ ని ఈ వారం ఆడియన్స్ హౌస్ నుంచి బయటకు పంపించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా గరగొచ్చు కాబట్టి ఆమె ఉండటం వల్ల హౌస్ లో గొడవలు ఉంటాయని ఆమె ను ఉంచి తర్వాత లీస్ట్ ఉన్న వారిని పంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి బిగ్ బాస్ ఈ వీకెండ్ ఏం చేస్తాడన్నది చూడాలి.
Also Read : Muttaiah Muralidharan : శ్రీలంక మాజీ క్రికెటర్ కి నాని సినిమాలంటే ఇష్టమట..!