Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ కాగా శుక్రవారం మాత్రం నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎవరన్నది నిర్ణయించడానికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మెట్స్ ఫోటోలు ఉన్న డాల్స్ ఒకచోట పెట్టగా బేబీ స్మైల్ సౌండ్ రాగానే హౌస్ మెట్స్ అంతా పరుగెత్తుకుంటూ వెళ్లి ఒకరి ఫోటో ఉన్న డాల్ ని తీసుకెళ్లి సేవ్ చేసే టార్గెట్ రీచ్ అవ్వాలి. అలా వెనక ఉన్న వారు ఎవరి ఫోటో ఉన్న డాల్ పట్టుకుంటారో వారు కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చేస్తారు.
ఈ క్రమంలో ముందు ప్రశాంత్ ను ఆ తర్వాత యానవర్, అమర్, రతిక ఇలా అందరు ఆట నుంచి తప్పుకున్నారు. చివరగా గౌతం, అర్జున్, శివాజి (Sivaji) మిగిలి ఉన్నారు. ఈ ముగ్గురిలో శివాజి గౌతం ఫోటో ఉన్న డాల్ తీసుకుని ఆయన బయట ఉన్నారు. మిగిలిన అర్జున్, గౌతం ఇద్దరు లోపలకు వెళ్లారు. కెప్టెన్సీ నుంచి గౌతం ఆట నుంచి తప్పుకున్నాడు. ఆ టైం లో తనని ప్రతిసారి శివాజి టార్గెట్ చేస్తున్నారని గొడవ పడ్డాడు.
ఇద్దరు తమ గొంతు పెంచు వాదనలు జరిపారు. ఇద్దరు మీద మీదకు వచ్చి మరీ గొడవ పడ్డారు. గౌతం అయితే బిగ్ బాస్ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది హౌస్ నుంచి వెళ్లిపోతా అని బిగ్ బాస్ గేట్ ని కూడా చేతితో కొట్టి డోర్ తీయండని అన్నాడు. గొడవ వాదనలు జరపడం వరకు ఓకే కానీ బిగ్ బాస్ నుంచి గౌతం వెళ్లిపోతా అని హడావిడి చేయడం మిగతా హౌస్ మెట్స్ కి కూడా నచ్చలేదు.
ఇక ఈ వారం కెప్టెన్ గా శివాజి అయినట్టు తెలుస్తుంది. ఇంకా ఐదు వారాల ఆట ఉండగా టైటిల్ రేసులో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : Balakrishna : అన్ స్టాపబుల్ షోకి బాలీవుడ్ స్టార్.. సీజన్ 3 ప్లాన్ అదుర్స్..!
We’re now on WhatsApp : Click to Join