BiggBoss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఒకప్పటి హీరో శివాజి ఉన్నాడని తెలిసిందే. హౌస్ లో తన ఆటతో పాటుగా యావర్, పల్లవి ప్రశాంత్ లకు సపోర్ట్ గా ఉంటూ ఆటని కొనసాగిస్తున్నాడు శివాజి. బిగ్ బాస్ సీజన్ 7 లో పెద్ద దిక్కుగా శివాజి మారాడు. అయితే రెండు వారాలుగా అతని కుడి చెయ్యి ఇబ్బంది వల్ల మండే ఎపిసోడ్ లో అతన్ని బయటకు పిలిచి స్కానింగ్ చేయించారు. అయితే ఈరోజు ఎపిసోడ్ లో మళ్లీ బిగ్ బాస్ కి వెళ్లి తన రిక్వెస్ట్ చెప్పినట్టు ఉన్నాడు శివాజి.
అంతకుముందే కెప్టెన్సీ టాస్క్ లో శివాజి (Sivaji)ని తొలగిస్తూ అమర్ దీప్ అతని పేరున్న ఐటెం ని స్విమ్మింగ్ పూల్ వాటర్ లోకి వదిలాడు. అయితే ఈ వారం తన కన్నా మిగతా వారు ఆట బాగా ఆడారు అన్న కారణం చేత శివాజిని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు అమర్ దీప్. దీనికి శివాజి బాగా హర్ట్ అయ్యాడు. పైకి ఏడవలేక నవ్వుతున్నా కానీ లోపల తనకు తాను ఏడుస్తున్నా అంటూ కన్ఫెషన్ రూంలో చెప్పాడు శివాజి.
శివాజి మొదటి వారం నుంచి మంచి ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నుంచి తనని తప్పించినంత మాత్రానా అతను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. అతను అమర్ దీప్ ని చాలాసార్లు టార్గెట్ చేసి మాటలు అన్నాడు. అవన్ని అమర్ దీప్ పట్టించుకోలేదు కానీ ఈ వారం నిజంగానే శివాజి చేతి నొప్పితో సరిగా ఆడలేదని కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు అమర్ దీప్.
ఇంతకీ ఈ వీక్ కెప్టెన్ (Captain) ఎవరు అవుతారు. యావర్ (Yawar) తర్వాత కెప్టెన్ గా ఎవరు ఎంపిక చేపడతారు అన్నది ఈరోజు తెలుస్తుంది. హౌస్ మెట్స్ అంతా కూడా కెప్టెన్ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ 3 రోజుల నుంచి జరిగిన గులాబి పురం జిలేబి పురం టాస్క్ లో గులాబి పురం విన్ అవడంతో వారి నుంచి ఒకరు కెప్టెన్ గా మారే ఛాన్స్ ఉంది.
Also Read : Leo: దళపతి విజయ్ క్రేజ్.. థియేటర్ లో అభిమాన జంట ఎగేంజ్ మెంట్