Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఆడియన్స్ ఎంగేజ్ బాగా క్యాచ్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ నయని పావని ఎలిమినేషన్ అంతా షాక్ అయ్యేలా చేయగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ రతిక, దామిని, శుభ శ్రీ లలో ఒకరు మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడు. అది హౌస్ మెట్స్ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. సండే ఎపిసోడ్ లోనే హౌస్ మెట్స్ అందరి చేత ఓటింగ్ వేయించారు నాగార్జున.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరు రావాలని అనుకుంటున్నారో హౌస్ మెట్స్ వారికి ఓటు వేశారు. మెజారిటీ పీపుల్ ఎవరికి ఎక్కువ ఓటు వేశారో వారిని హౌస్ లోకి తీసుకొస్తారు. కానీ ఇక్కడే ఉల్టా పుల్టా అని మెలిక పెట్టారు నాగార్జున (Nagarjuna). ఓటింగ్ లో లీస్ట్ వచ్చిన వారు హౌస్ లో రీ ఎంట్రీ ఇస్తారని చెప్పారు. సో అప్పుడు హౌస్ మెట్స్ అంతా కూడా నాలిక కొరుక్కున్న పరిస్థితి ఏర్పడింది.
Also Read : Tarun Bhaskar Keeda Cola Trailer : కీడా కోలా ట్రైలర్.. తరుణ్ భాస్కర్ మరో వండర్..!
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఊహించలేనట్టుగా ఉంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవడం వల్ల సీజన్ 7 ని ఎలాగైనా సూపర్ హిట్ చేయాలని బిగ్ బాస్ టీం అంతా చాలా కష్టపడుతున్నారు. లాస్ట్ వీక్ కొత్తగా ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా మిగతా వారితో వాళ్లు కూడా కలిసి ఆట ఆడుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక (Rathika) మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. మరి బయట ఆడియన్స్ రెస్పాన్స్ చూసి వచ్చిన రతిక లోపలకి వెళ్లాక ఎలా ఆట ఆడుతుందో చూడాలి. హౌస్ లో ఉన్నప్పుడు రతిక ప్రశాంత్ తో ముందు క్లోజ్ గా ఉండి ఆ తర్వాత అతనితో గొడవలు పెట్టుకుంది. అంతేకాదు తన మాజీ లవర్ గుర్తొస్తున్నాడు అంటూ బాధపడింది. మరి రీ ఎంట్రీలో ఆమె వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది చూడాలి.