Site icon HashtagU Telugu

Bigg Boss 7 : కంటెస్టెంట్స్ కి నాగార్జున సీరియస్ వార్నింగ్..!

BiggBoss Season 8 Host Those Star Only for Option

BiggBoss Season 8 Host Those Star Only for Option

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) వీకెండ్ ఎపిసోడ్స్ అంటే శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి వారం మొత్తం జరిగిన టాస్క్ ల గురించి కంటెస్టెంట్స్ మధ్య గొడవల గురించి ఆరా తీస్తారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యారు. ఈ సీజన్ లో మొదటి సారి నాగార్జున కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యారు. ఈ వారం జరిగిన పవర్ అస్త్ర టాస్క్ లో కంటెండర్స్ మధ్య వివిధ సందర్భాల్లో జరిగిన గొడవలను చూపించి వారందరికి క్లాస్ పీకాడు.

అంతేకాదు ఈసారి శనివారం నాగార్జున కన్ఫర్మెడ్ హౌస్ మెట్స్ లో ఎవరు అన్ డిజర్వెడ్ కంటెస్టెంట్ ఎవరన్నది చెప్పమంటే మెజారిటీ కంటెస్టెంట్స్ శివాజి అని చెప్పడంతో హౌస్ కాల్ ప్రకారం శివాజిని అన్ డిజర్వ్ చేసి అతని పవర్ అస్త్రని బ్రేక్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 లో నాగార్జున హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అంతకుముందు నాగార్జున ఎపిసోడ్స్ చూస్తున్నారా లేదా వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారా అన్నట్టుగా ఉండేది. కానీ తనకున్న బిజీ టైం లో నాగార్జున 1 గంట బిగ్ బాస్ కోసం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

తను షో చూస్తూ బిగ్ బాస్ (Bigg Boss 7) టీం ఇచ్చే ప్రశ్నలతో తను టాలీ చేసుకుంటూ ఈసారి హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు నాగార్జున. శనివారం ఎపిసోడ్ అంతా కూడా హాట్ హాట్ గా సాగింది. లాస్ట్ వీక్ ఒక టాస్క్ లో తేజ గౌతం కృష్ణ మెడ మీద ఒక తాడుతో లాగడాన్ని నాగార్జున ఖండించారు. టాస్క్ లో అవతల వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని కంటెస్టెంట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున ఓవిధంగా ఆడియన్స్ కి నాగార్జున ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పొచ్చు.

ఆదివారం ఎపిసోడ్ అంటే సండే కాబట్టి ఫన్ డే సో ఈరోజు ఆటపాటలతో ఎపిసోడ్ హంగామా చేయనుంది. బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా రతిక ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది.

Also Read : Hyper Aadi : ఏ హీరోని వదిలిపెట్టని హైపర్ ఆది.. ఎన్టీఆర్ నుంచి కిరణ్ వరకు సెన్సేషనల్ కామెంట్స్..!