బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) లో దీపావళి సందర్భంగా వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా శివాజిని ఒకటి రెండు స్థానాల్లో ఉంచారు. అయితే బిగ్ బాస్ లో అతను ఆడేది సింగిల్ గేమ్ కాదు డబుల్ గేమ్ అని అంటున్నారు కొందరు ఆడియన్స్. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే కానీ అతను పల్లవి ప్రశాంత్, యావర్ లను ఎంకరేజ్ చేసి మిగతా వారిని ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్ ని టార్గెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
అంతేకాదు ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సోమవారం నామినేషన్స్ కన్నా ముందు రతికతో శివాజి నువ్వు ఏం చెప్పాలనుకున్నా మొహమాటం లేకుండా ధైర్యంగా మాట్లాడు అంటూ ఆమె మీద ఇన్ ఫ్యూయెన్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అతను చెప్పాడనో లేదా మరో కారణమో కానీ రతిక శోభా శెట్టి, ప్రియాంకల మీద వీరంగం ఆడేసింది.
రతిక నామినేషన్ వాళ్లిద్దరే అనే శివాజి ఆమెను అంతగా రెచ్చగొట్టాడని బయట మాట్లాడుకుంటున్నారు. శివాజి మంచి పర్సనే కానీ అతను కేవలం కొందరికి మాత్రమే సపోర్ట్ గా ఉంటున్నారు. మైండ్ గేమ్ తో అందరికీ పైకి మంచిగా కనిపిస్తున్నా లోపల తన ప్లాన్స్ చాలా పెద్దవే అని చెప్పుకుంటున్నారు.
అయితే టైటిల్ రేసులో శివాజి ముందంజలో ఉన్నా అతనితో పాటు శివాజి యావర్ అమర్ ఇలా అందరు కూడా పోటీలో ఉన్నారు. మరి వీరిలో టాప్ 5 ఎవరు టాప్ 3 ఎవరన్నది చూడాలి.
Also Read : Leo: ఓటీటీలోకి లియో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
We’re now on WhatsApp : Click to Join