Bigg Boss 7 : నలుగురు అమ్మాయిలే ఎలిమినేట్.. ఏం జరుగుతుంది..?

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7 ) నుంచి ఆదివారం రతిక ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్

Published By: HashtagU Telugu Desk
Bigg Boss 7 Four Female Con

Bigg Boss 7 Four Female Con

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) నుంచి ఆదివారం రతిక ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌస్ లోకి వచ్చిన రతిక తన ఎక్స్ లవర్ పేరుని వాడుకుని ఆట ఆడుదాం అనుకుంది. కానీ హౌస్ లో ఆట ఆడకుండా ఉన్న వారిని ఎక్కువ రోజులు హౌస్ లో ఉంచరు. ఫైనల్ గా రతిక ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఇప్పటివరకు నలుగురు హౌస్ మెట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే వారిలో అందరు అమ్మాయిలే ఉండటం విశేషం.

బిగ్ బాస్ సీజన్ 7 నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం దామిని హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయ్యింది. అయితే బిగ్ బాస్ హిస్టరీలో ఇలా ఒక సీజన్ లో ఇలా నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం అందరికి షాక్ ఇచ్చింది. సీజన్ 7 లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ అమ్మాయిలే అవ్వడం నెక్స్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ మేల్ కంటెస్టెంట్ అవుతాడా లేదా మళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్ అవుతాడా అని అంచనా వేస్తున్నారు.

ఈ సీజన్ లో నాగార్జున (Nagarjuna) హోస్టింగ్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇన్నాళ్లు ఎపిసోడ్స్ చూడకుండా కేవలం బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ నే చూస్తున్నాడు అని అనుకున్న నాగ్ కాస్త ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తూ హోస్టింగ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. సీజన్ 6 కన్నా సీజన్ 7 చాలా బెటర్ గా ఉందని ఆడియన్స్ చెబుతున్నారు.

బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 ఉల్టా పుల్టా రాబోయే రోజుల్లో మరింత క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు నలుగురు కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి వస్తారని చెప్పుకుంటున్నారు.

Also Read : Skanda: స్కంద బాక్సాఫీస్ కలెక్షన్స్.. 4 రోజుల్లో 43 కోట్లు

We’re now on WhatsApp. Click to Join

  Last Updated: 02 Oct 2023, 06:28 PM IST