Bigg Boss 7 : సీరియల్ బ్యాచ్ మధ్య చిచ్చు పెట్టిన ఫినాలే పాస్..!

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) లో ఈ వారం ఫినాలే పాస్ టాస్క్ నడుస్తుంది. మంగళవారం నుంచి ఈ టాస్క్ నడుస్తుంది. అయితే ఈసారి కొత్తగా

Published By: HashtagU Telugu Desk
Bigg Boss 7 Finale Pass Task Distabance Between Star Maa Serial Batch

Bigg Boss 7 Finale Pass Task Distabance Between Star Maa Serial Batch

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) లో ఈ వారం ఫినాలే పాస్ టాస్క్ నడుస్తుంది. మంగళవారం నుంచి ఈ టాస్క్ నడుస్తుంది. అయితే ఈసారి కొత్తగా ఈ ఫినాలే పాస్ కోసం రకరకాల టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. వీటిలో ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వాళ్లు తాము గెలుచుకున్న పాయింట్స్ ని వేరే హౌస్ మెట్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే శివాజి. శోభా శెట్టి ఇద్దరు లీస్ట్ పాయింట్స్ రాబట్టుకోగా తమ పాయింట్స్ అన్నిటినీ అమర్ కి ఇచ్చేశారు.

బుధవారం టాస్కులు జరగ్గా అందులో ప్రియాంకా లీస్ట్ పాయింట్స్ లో ఉంది. ఆమె పాయింట్స్ లో సగం మరొకరికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పగా తను అమర్ దీప్ కి ఇస్తుందని అనుకోగా గౌతం కి ఇచ్చింది. తనని కెప్టెన్ చేయడంలో గౌతం హెల్ప్ చేశాడని గౌతం కి తన పాయింట్స్ ఇచ్చింది ప్రియాంక. అక్కడే అమర్ హర్ట్ అయ్యాడు. తన ఫ్రెండ్ తనకు ఇస్తుందని అనుకోగా గౌతం కి ఇచ్చి షాక్ ఇచ్చిందని ఫీల్ అయ్యాడు.

Also Read : Jos Alukkas jewellery Robbery: కోయంబత్తూర్ జోస్ అలుకాస్ జ్యువెలరీ షాప్ లో దోపిడీ

శోభా శెట్టి, అమర్ ఇద్దరు ప్రియాంకా తీసుకున్న నిర్ణయం వల్ల హర్ట్ అయ్యారు. అమర్ కి ప్రియాంక నచ్చ చెప్పాలని చూసినా అతను కన్విన్స్ అవ్వలేదు. ఈ క్రమంలో శోభా శెట్టి చపాతీ కర్రీ చేయాలని ప్రియాంక ని పిలిస్తే లేట్ గా రియాక్ట్ అవుతుందని ప్రియాంక మీద శోభా కూడా కోప్పడ్డది.

సీరియల్ బ్యాచ్ అయిన అమర్, ప్రియాంక, శోభా శెట్టి ముగ్గురు మొదటి నుంచి క్లోజ్ గా ఉన్నారు. టాస్కుల్లో కూడా వీరు సపోర్ట్ చేసుకున్నారు. కానీ ఫినాలే టాస్క్ లో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియాంకని గ్రూప్ గేం ఆడొద్దని నాగార్జున చెప్పడంతో ఆమె ఆట మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. మొత్తానికి ప్రియాంక అమర్ శోభా శెట్టిల మధ్య చిన్న పాటి డిస్టబెన్స్ వచ్చిందని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 29 Nov 2023, 11:42 PM IST