Bigg Boss 7 Finale : బిగ్ బాస్ గ్రాండ్ ఫినల్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు..?

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వీక్ కు వచ్చేసింది. ఈ సీజన్ మొదటి నుండి అలరిస్తూ టాప్ రేటింగ్ తో కొనసాగుతూ వచ్చింది. సీరియల్ బ్యాచ్ , రైతు బిడ్డ , పాట బిడ్డ , సినీ స్టార్స్ ఇలా అంత కూడా సందడి చేసారు. ఇక బిగ్ బాస్ సైతం గత సీజన్ తప్పులు జరగకుండా మొదటి నుండి చక్కటి ప్లాన్ తో ముందుకు […]

Published By: HashtagU Telugu Desk
Mahesh Bigg Boss Final

Mahesh Bigg Boss Final

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వీక్ కు వచ్చేసింది. ఈ సీజన్ మొదటి నుండి అలరిస్తూ టాప్ రేటింగ్ తో కొనసాగుతూ వచ్చింది. సీరియల్ బ్యాచ్ , రైతు బిడ్డ , పాట బిడ్డ , సినీ స్టార్స్ ఇలా అంత కూడా సందడి చేసారు. ఇక బిగ్ బాస్ సైతం గత సీజన్ తప్పులు జరగకుండా మొదటి నుండి చక్కటి ప్లాన్ తో ముందుకు తీసుకెళ్లారు. టెన్షన్ పెట్టె నామినేషన్స్ , రసవత్తరగా సాగే గేమ్స్ , మధ్య మధ్యలో సీరియల్ భామల అందాల ఆరబోత ఇలా అందరికి సమపాలనలో న్యాయం చేస్తూ షో సక్సెస్ అయ్యింది. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్.. ఫైనల్ వీక్ కు ఆరుగుర్ని హౌస్ లో ఉంచాడు. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ పూర్తి కాబోతుంది. మరి ఈ 7 సీజన్ విజేత ఎవరనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం పోల్ అయిన ఓట్లు చూస్తుంటే… టాప్ 1 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ .. రెండో స్థానంలో శివాజి ఉండగా… నాలుగో స్థానంలో ఉన్న అమర్ దీప్ మూడో స్థానానికి వచ్చేశాడు. ఏవీ ఎఫెక్ట్ తో యావర్ ను వెనక్కి నెట్టి మరీ మూడో స్థానానికి వచ్చేశాడు. ఇక నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉండగా… అంబటి అర్జున్ ఐదో స్థానంలో, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో ఉన్నారు. మరి ఈ రెండు రోజుల్లో ఏంజరుగుతుంది చూడాలి. ఇక ఫైనల్ ఈవెంట్ గా గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ రాబోతున్నట్లు వినికిడి. మహేష్ బాబు (Mahesh Babu) ఈ ఫినాలే కార్యక్రమంలో పాల్గొని విజేతను ప్రకటించి ట్రోఫీ అందజేయబోతున్నారని అంటున్నారు. పనిలో పనిగా తన గుంటూరు కారం సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహించినట్లు ఉంటుందన్న ఉద్దేశంతోనే మహేష్ బాబు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.

Read Also : AP News: పవన్ ని నమ్మి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: సజ్జల

  Last Updated: 13 Dec 2023, 04:00 PM IST