Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో 9వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. సోమ, మంగళవారాల్లో ఈ నామినేషన్స్ జరిగాయి. హౌస్ మేట్స్ అంతా కూడా తాము నామినేట్ చేయాలనుకునే వారిని స్నేక్ ముందు ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ నుంచి ఏదో ఒక కలర్ డస్ట్ వారి ముచం మీద పడుతుంది. ఈ క్రమంలో ఎప్పటిలానే హాట్ హాట్ గా నామినేషన్స్ జరిగాయి. ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, రతిక, ప్రియాంక, తేజ, శోభా శెట్టి, అర్జున్, యావర్, బోలే శావలి ఉన్నారు.
రతిక అమర్ దీప్ లకు ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. వీరు కాకుండా మిగతా వారు నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే నామినేట్ అయిన ఈ ఎనిమిది మందిలో రిస్క్ ఎవరికి ఉంది అన్నది చూస్తే అది స్టార్ మా బ్యాచ్ కే అని చెప్పొచ్చు. ఆల్రెడీ శోభా శెట్టి మీద ఆడియన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఆమె హౌస్ లో చేస్తున్న ఓవర్ కి ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు. ఈ క్రమంలో లాస్ట్ వీకే ఆమెను ఎలిమినేట్ చేస్తారని అనుకోగా అది జరగలేదు.
Also Read : Prabhas : ప్రభాస్ తో మారుతి.. బాషా రేంజ్ లో ఆ సీన్స్..!
కానీ ఈ వారం ఆమెను ఎలిమినేట్ చేయాల్సిందే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అర్జున్ కూడా మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. అతనికి కూడా ఓటింగ్ తక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక 3వ ప్లేస్ లో రతిక ఉంది. ఈ వారం డేంజర్ జోన్లో ఈ ముగ్గురు ఉన్నారు. మరి ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అన్నది వీకెండ్ తెలుస్తుంది.
బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా ఈ వారం ఎలిమినేషన్ ఏదైనా ట్విస్ట్ పెడతారేమో చూడాలి. ఈ సీజన్ లో ఒక్కసారి కూడా డబుల్ ఎలిమినేషన్ చేయలేదు. మరి ఈ వీకెండ్ అలాంటిది ఏమైనా చేసి ఆడియన్స్ కి, హౌస్ మెట్స్ కి షాక్ ఇస్తారేమో చూడాలి.
We’re now on WhatsApp : Click to Join