Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరో 4 వారాలు మాత్రమే ఉండగా ఈ టైం లో ఎవరికి వారు అవతల వారిని టార్గెట్ చేస్తూ ఆట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మొదలైంది. లాస్ట్ వీక్ ఆటతో పాటుగా కెప్టెన్సీ టాస్క్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి ప్రస్తావిస్తూ నామినేషన్స్ జరిగాయి. అమర్ దీప్ యావర్, రతికలను నామినేట్ చేయగా.. వారిద్దరు కూడా తిరిగి అమర్ ని నామినేట్ చేశారు.
పల్లవి ప్రశాంత్ ని గౌతం, గౌతం ని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. రతికని పల్లవి ప్రశాంత్ కూడా నామినేట్ చేయగా రివర్స్ నామినేషన్ గా రతిక కూడా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది. అర్జున్ యావర్, శివాజిలను నామినేట్ చేశాడు. యావర్ అమర్, అర్జున్ లను నామినేట్ చేశాడు.
లాస్ట్ సండే నో ఎలిమినేషన్ అనేసిన నాగార్జున నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పాడు. అందుకే హౌస్ మెట్స్ అంతా కూడా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ నే టార్గెట్ చేశారు. ఆల్రెడీ రతిక నామినేషన్స్ లో ఉంది కాబట్టి ఆమెతో పాటు మరొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
మామూలుగా అయితే శోభా, అశ్వినిలు నామినేషన్స్ లో ఉండాలి కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య ఎలిమినేషన్ ఫైట్ ఉండాలని అమర్, శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్, గౌతం లు నామినేషన్స్ లోకి వెళ్తున్నారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈరోజు కూడా అది కొనసాగుతుంది కాబట్టి ఫైనల్ గా ఈ వీక్ ఎవరెవరు నామినేట్ అయ్యారన్నది సాయంత్రం ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది.
Also Read : Allu Aravind : పోలీసులను పోలీసులే చేజ్ చేస్తే.. వ్యవస్థని ఖండించే ప్రయత్నమే కోటబొమ్మాళి..!
We’re now on WhatsApp : Click to Join