Bigg Boss 7 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా లేదా..?

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7)లో 3వ వారం హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. హౌస్ లో తన ఆట తీరు

Published By: HashtagU Telugu Desk
Bigg Boss 7 Audiance Waitin

Bigg Boss 7 Audiance Waitin

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7)లో 3వ వారం హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. హౌస్ లో తన ఆట తీరు సంతృప్తికరంగా ఉందని ఆడియన్స్ తనకు ఎందుకు ఓట్లు వేయలేదో అని అంటున్నారు దామిని. ఇక నాల్గవ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఆల్రెడీ శివాజి, సందీప్, శోభా శెట్టి పవర్ అస్త్ర ఉన్న కారణంగా నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ లేదు. హౌస్ లో ఉన్న 11 మందిలో ముగ్గురు సేఫ్ పొజిషన్ కాగా మిగిలిన ఎనిమిది మందిలో నామినేషన్స్ ఉంటాయి.

ఇదిలాఉంటే గత వారం రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ వస్తారని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ సోమవారం ఉంటుందని అన్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిది ఏమి లేదని అనిపిస్తుంది. ఈరోజు ఎలాగు నామినేషన్స్ కాబట్టి కంటెస్టెంట్స్ అంతా కూడా ఆ హడావిడిలో ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 7 కేవలం 14 మంది సభ్యులతోనే ఆట మొదలైంది.

Bigg Boss 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీరియల్ యాక్టర్ అర్జున్ అంబటి వస్తున్నాడని గట్టిగా ప్రచారం జరిగింది. మరో సీరియ యాక్టర్ కూడా హౌస్ లోకి వెళ్తారని అంటున్నారు. కానీ వారాలు గడుస్తున్నా కొద్దీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం లేదు. ఇంకెప్పుడు వారిని హౌస్ లోకి పంపిస్తారని ఆడియన్స్ అడుగుతున్నారు.

వీకెండ్ ఎపిసోడ్స్ తర్వాత మండే నాడు నామినేషన్స్ ఫైట్ జరుగుతుంది. అది కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ కి మంచి కంటెంట్ అనిపిస్తుంది. ఈవారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారు ఎలిమినేట్ ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ముందు నుంచి ఉల్టా పుల్టా అంటున్న నాగ్ ఎలిమినేషన్స్ జరుగుతున్నా కూడా హౌస్ లో ఇంకా వారిని హౌస్ మెట్స్ చేయకపోవడం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు.

Also Read : Srileela : ప్రభాస్ తో జోడీ.. శ్రీ లీల జోరు తగ్గట్లేదుగా..!

  Last Updated: 25 Sep 2023, 11:23 AM IST