Site icon HashtagU Telugu

Bigg Boss 7 : వాళ్లని ఇంకెన్నాళ్లు కాపాడుతారు..?

Bigg Boss 7 Finale Pass Task Distabance Between Star Maa Serial Batch

Bigg Boss 7 Finale Pass Task Distabance Between Star Maa Serial Batch

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఆదివారం గౌతం కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అర్జున్, యావర్, శివాజి, పల్లవి ప్రశాంత్, శోభా, ప్రియాంక, గౌతం ఉన్నారు. అమర్ ఒక్కడే లాస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. అయితే నామినేషన్స్ లో ఉన్న వారందరిలో గౌతం కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతని ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ ఆడియన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఎలిమినేషన్స్ కాదని స్టార్ మా బ్యాచ్ ని కాపాడుకుంటూ బిగ్ బాస్ టీం కావాలని మిగతా వారిని ఎలిమినేట్ చేస్తున్నారని అంటున్నారు.

Also Read : Trisha praises Animal: త్రిష యానిమల్ మూవీ రివ్యూ: వివాదంతో పోస్ట్ తొలగింపు

బిగ్ బాస్ సీజన్ 7 లో గౌతం ఎలిమినేషన్ తర్వాత ఇంకా ఏడుగురు హౌస్ మెట్స్ మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టి లీస్ట్ ఓటింగ్ ఉన్నా ఆమెను కావాలని సేఫ్ చేస్తున్నారని. స్టార్ మా బ్యాచ్ అవ్వడం వల్ల వాళ్లని కాకుండా మిగతా వారిని ఎలిమినేట్ చేస్తున్నారని అంటున్నారు.

ఇక ఈ సీజన్ విన్నర్ రేసులో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజి, ప్రశాంత్ తో పాటుగా అమర్ దీప్ కూడా విజేత అయ్యే ఛాన్సులు ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే రానున్న రెండు వారాల్లో వారి ఆట తీరుని బట్టి ఓటింగ్ జరుగుతుంది. ఇదిలాఉంటే ఆల్రెడీ ఫినాలే పాస్ గెలుచుకుని అర్జున్ టాప్ 5 గా మొదటి ఛాన్స్ అందుకున్నాడు. సో టాప్ 5 లిస్ట్ లో అర్జున్ కన్ ఫర్మ్ అవగా మిగతా నలుగురు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp : Click to Join