Site icon HashtagU Telugu

Bigg Boss 7 Ashwini : చేజేతులా చేసుకున్న అశ్విని.. ఆమె వెంటే హౌస్ వదులుతున్న రతిక..!

Bigg Boss 7 Ashwini Eliminated And Rathika Is Going To Be Eliminate

Bigg Boss 7 Ashwini Eliminated And Rathika Is Going To Be Eliminate

Bigg Boss 7 Ashwini బిగ్ బాస్ సీజన్ 7 లో అశ్విని ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. మండే రోజు ఆమె సెల్ఫ్ నామినేషన్ వేసుకోవడమే ఆమెను ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేసింది. ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదు వారాల తర్వాత హౌస్ లోకి వచ్చిన అశ్విని తన మార్క్ చూపించాలని ప్రయత్నించింది. హౌస్ లో ప్రియాంక, శోభా శెట్టిల డామినేషన్ ఉందంటూ హౌస్ లో వారితో గొడవ పడిన అశ్విని ఏడు వారాలు సర్వైవ్ అయ్యింది.

We’re now on WhatsApp : Click to Join

ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటానని భావించింది. కానీ ఆడియన్స్ ఆమె సెల్ఫ్ నామినేషన్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. చేజేతులారా అశ్విని తనని తాను నామినేట్ చేసుకుని తప్పు చేసింది. ఇక ఈ వారం హౌస్ లో డబల్ ఎలిమినేషన్ అని చెప్పారు నాగార్జున.

సో శనివారం అశ్విని బయటకు రాగా ఈరోజు అంటే సండే రతిక ఎలిమినేషన్ జరుగుతుంది. రతిక ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. బయట ఆడియన్స్ ఎవరిని ఫాలో అవుతున్నారో చూసి వెళ్లిన ఆమె స్పై బ్యాచ్ శివాజి, యావర్, పల్లవి ప్రశాంత్ తో కలిసి ఉండాలని అనుకుంది. ఆమె రీ ఎంట్రీ వల్ల యావర్ ఆట డిస్టర్బ్ అయ్యింది.

ఫైనల్ గా ఒకే వీకెండ్ ఇద్దరు హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఇక టాప్ 5 రేసులో ఎవరు ఉంటారు.. ఈ మూడు వారాల్లో ఎవరు సర్వవి అవుతారన్నది చూడాలి.

Also Read : Sandeep Vanga : యానిమల్ కత్తెర కూడా సందీప్ చేతికే ఎందుకంటే..!